షూటింగ్ లో సుడిగాలి సుధీర్ కు ఘోర ప్రమాదం

0
35

సుడిగాలి సుధీర్ ఈ పేరు తెలియని తెలుగు వారు దాదాపు ఉండరనే చెప్పుకోవచ్చు .అటు జబర్దస్త్ లోను మరియు ఢీ  ప్రోగ్రాం లోను తనదైన శైలి లో అభిమానులను సంపాదించుకున్నాడు . ఇక జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ వస్తుందంటే చాలు చిన్న పెద్ద  అని తేడా లేకుండా అందరు టీవీ లకుఅతుక్కుపోతారు . ఇక రష్మీ మరియు సుధీర్ జోడి గురించి వచ్చే గాసిప్స్  సోషల్ మీడియా లో రోజుకో వార్త చక్కర్లుయి కొడుతూ ఉంటుంది .

ఇటీవల జరిగిన ఒక ప్రోగ్రామ్ లో సుధీర్ మరియు రష్మీ లు పెళ్లి కూడా చేసుకున్నారు . ఇలా వారిద్దరి మధ్య ఏ వార్త అయినా సరే అది టెలికాస్ట్ అయినా కొద్దీ నిమిషాలలోనే సోషల్ మీడియాలో మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంటాయి . ఇక ఈ షోలే కాకుండా సుధీర్ ఇతర సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో మెరుస్తూఉంటాడు . ఇక ఈ రోజు ఒక ప్రముఖ టివి ఛానల్ లో వచ్చిన సుడిగాలి సుధీర్ పెళ్లి గోల ప్రోగ్రాం లో కొన్నిస్టెంట్ లు  చేసి గాయాల పాలైనట్టు తెలుస్తుంది .
అప్పటి వరకు ఆ షోలో మంచి సందడి వాతావరణం నెలకొన్న కొన్ని నిమిషాలకే ఈ సంఘటన చోటు చేసుకోవడం విషాదకరం . ఈ ప్రమాదంలో సుధీర్ కు తీవ్ర గాయాలయ్యాయి . తల మీద రక్తం తో ఉన్న వీడియో ఆ షో యాజమాన్యం విడుదల చేసింది . ఈ షో ప్రస్తుతం ఉగాది ని పురస్కరించుకొని జరుగుతుంది ఇలాంటి షో లో  సుధీర్ దెబ్బతగలడం బాధాకరమైన విషయం. అసలు ఎం జరిగిందో తెలియాలంటే ప్రోగ్రాం వచ్చే దాకా వేచి చూడాల్సిందే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here