కూతురిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సుమ, మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
147
అటు టివి తెరపై పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ, ఇటు రకరకాల ఫంక్షన్లు మరియు సినిమా ఆడియో వేడుకలకు కూడా ప్రత్యేకంగా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి సుమ. ఇక 90వ దశకంలో వచ్చిన ఝాన్సీ, అనిత చౌదరి, ఉదయ భాను వంటి వారు తనకు పోటీగా ఉన్నప్పటికీ, వారందరిని దాటుకుని ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు సుమ కనకాల. ఇక పలు ప్రోగ్రాంలు, సీరియాయళ్ళలో నటిస్తున్న సమయంలో సీనియర్ జంట దేవదాస్, లక్ష్మి కనకాలల కుమారుడు రాజీవ్ ని పెళ్లి చేసుకున్న సుమకు ఒక కుమారుడు రోషన్, ఒక కుమార్తె మనస్విని. అయితే తమ పిల్లలకు మొదటి నుండి ఎక్కువగా స్వేచ్ఛనిచ్చేవారిమని, ఎందుకంటె రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక, చిన్నపుడు మా అమ్మ నాన్న మాకు ఎన్నో ఆంక్షలు పెట్టారు అని వారు ఎప్పుడు అనుకోకూడదు అనే ఉద్దేశ్యంతోనే వారికి మొదటినుండి అన్నీ సమకూర్చేవాళ్లమని సుమ చెప్తుంటారు. అయితే సుమ కూతరు మనస్విని అక్కడక్క కొన్ని సీరియళ్ళలో చిన్నపుడు నటించింది. కాగా ఇటీవల కుమారుడు రోషన్, యాక్టర్ శ్రీకాంత్ కుమారుడు హీరోగా రూపొందిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించాడు.
అయితే ఇటీవల కూతురు మనస్విని తన ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి పేరు సంపాదిస్తుండడం చూసి, తాను కూడా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తానని సుమని అడిగిందట. అయితే, నువ్వు చెప్పింది కరెక్ట్, కాకపోతే ఇప్పుడు అన్నయ్యది, నీది చదువుకునే వయసు, కాబట్టి ప్రస్తుతం మీ ఇద్దరి దృష్టి చదువు మీదనే ఉంచాలి. బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చిన తరువాత మెల్లగా నటనలో శిక్షణ తీసుకుని ఆ తరువాత ప్రయత్నాలు ప్రారంభిస్తే అవకాశాలు మెల్లగా వస్తయని సుమ తన కూతురుకి గట్టిగా సమాధానమిచ్చిందట. అయితే రోషన్ విషయంలో మాత్రం, శ్రీకాంత్ గారి అబ్బాయికి వాడు స్నేహితుడు కావడం వల్లనే, అయన కోరికమేరకు అందులో నటించడానికి అనుమతి ఇచ్చామని, అయితే వాడు కూడా ప్రస్తుతం చదువుపైనే దృష్టిపెట్టనున్నాడని, ఇద్దరికీ నటనలోకి ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తేల్చిచెప్పారట సుమ. కాగా ప్రస్తుతం ఈ వార్త కొన్ని మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here