అంబరీష్ చనిపోయాక ప్రస్తుతం సుమలత ఎవరితో ఉందొ తెలుసా!

0
155
ఇటీవల సినీరంగ పరిశ్రమలో కొందరు ప్రముఖులు వరుసగా మరణించడం ప్రజలను మరియు వారి అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతోంది. కొన్నినెలల క్రితం బ్యూటీ క్వీన్ శ్రీదేవి మరణాన్ని అందరూ మరువక ముందే ప్రముఖ కన్నడ నటుడు మరియు అక్కడి రెబల్ స్టార్ అయిన అంబరీష్ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఇక అయన మరణంతో కేవలం కన్నడ సినిమా పరిశ్రమలో మాత్రమే కక అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను అనేకమంది ప్రేక్షకులు బాధపడ్డారు. కాగా అయన భార్య సుమలతకు ఇటు టాలీవుడ్, కోలీవుడ్ తోనూ మంచి అనుబంధం ఉండడం, అంతేకాక అంబరీష్ తో రజినీకాంత్, కమల్, చిరంజీవి తదితర ప్రముఖులతో బాగా పరిచయం ఉండడంతో చిరంజీవి, రజినీకాంత్ అయన మృతికి నివాళులు అర్పించడానికి వెళ్లారు.
అయితే అంబరీష్ మరణం తరువాత భార్య సుమలత చాలా వరకు కృంగిపోయారని, ఎందరు కుటుంబసభ్యులు చెపుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆమె భర్తనే తలుచుకుంటూ వున్నారని అంటున్నారు. ఇక ఇటీవల తన కుమారుడు అభిషేక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో అతడు సుమలత, మరియు తండ్రి అంబరీష్ ల ఆశీర్వాదంతో ఆ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్తున్నాడు. ఇక ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తల్లి సుమలత ను అభిషేక్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడని ఆమె బంధువులు చెపుతున్నారు. ఇక కొందరు సినీ ప్రముఖులు కూడా రోజు సుమలత ఇంటికి వస్తూ ఆమె యోగ క్షేమాలు అడిగితెలుసుకుంటున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here