నాగ్ తో సుమలత పెళ్లి ఎందుకు చెడిందో తెలిస్తే షాక్ అవుతారు!

0
184
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మొన్న శనివారం హఠాన్మరణం చెందడంతో కన్నడ సినీ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అయన మృతికి నివాళిగా అక్కడి సినీ నిర్మాతలు నేడు షూటింగులకు విరామం ప్రకటించారు. ఇక ఆయన పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా నివాళులు అర్పించి, అయన ఆత్మకు శాంతి చేరకూరలని కోరుకున్నారు. ఇకపోతే మొదట్లో సుమలత మరియు అంబరీష్ కలిసి కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం మొదలవడం, మెల్లగా అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. ఇకపోతే ప్రస్తుతం సుమలత పెళ్లి విషయమై ఒక వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా గా మారింది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, నిజానికి కొన్నేళ్ళక్రితం అప్పటి టాప్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు గారు, ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సినిమాలో మరొక పాత్రలో నటిస్తున్న సుమలతను చూసి ముచ్చటపడి, ఇలా అన్నారట. అమ్మాయి ఎవరు నువ్వు నీ పేరు ఏంటి, నీకు పెళ్లి అయిందా అంటూ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారట.
Image result for nagarjuna sumalatha photos
అయితే నాగేశ్వరరావు గారు తన గురించి అడగడంతో ఒకింత పులకరించిపోయిన సుమలత, లేదు సార్, నేను కొత్త నటిని, నాకు పెళ్లి కాలేదు అని చెప్పారట. దానికి నాగేశ్వరరారావు గారు ప్రతిస్పందిస్తూ, అయితే కొద్దిరోజులు ఆగు, నీకోసం ఒక అబ్బాయి విదేశాల నుండి వస్తున్నాడు, అతన్ని వివాహం చేసుకుందువుగాని అని అన్నారట. అయితే ఆ అబ్బాయి ఎవరని సుమలత అడగడంతో, అతను మా అబ్బాయి నాగార్జున అని చెప్పడంతో సుమలత కొంత ఉప్పొంగిపోయిందట. కాగా ఆ విషయం కొన్నాళ్ళకు వారిద్దరూ మర్చిపోవడంతో ఆ తరువాత నాగ్ కు వెంకటేష్ అక్కయ్యతో వివాహం జరిగిపోయింది. ఆ తరువాత సుమలతకు అంబరీష్ తో వివాహం జరిగింది. ఇక ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన ఈ ఘటన, ఇప్పుడు అంబరీష్ మరణంతో బయటకు రావడంపై పలువురు నెటిజన్లు అసలు ఈ వార్త నిజమా, కాదా అంటూ తమలో తాము చర్చించుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here