షోలో ప్యాంట్ విప్పించిన సునామి సుధాకర్…. ఫైర్ అవుతున్న నెటిజన్స్!

0
103
ప్రస్తుతం ఈటివి అనుబంధ ఛానల్ అయిన ఈటివి ప్లస్ లో ప్రసారం అవుతున్న పటాస్ షోకి మంచి రేటింగ్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో అంతగా ఆకట్టుకోని ఈ షో, మెల్లగా ప్రేక్షకాభిమానం సంపాదించి ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఇక ఈ షోకి వచ్చి తమ టాలెంట్ ని చూపించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అలా ఎందరో యువతీ యువకులు ఈ షోకి వచ్చి తమ టాలెంట్ ని ప్రదర్శించి మంచి పేరు సంపాదించినవారున్నారు. ఇకపోతే నిన్న ప్రసారమైన ఈ షోలో బులెట్ భాస్కర్, సునామి సుధాకర్ స్పెషల్ గెస్టులుగా వచ్చిషోలో సందడి చేసారు. అయితే షోలో తమ కామెడీ స్కిట్స్,  పంచ్ డైలాగులతో అదరగొట్టిన ఈ ఇద్దరు నటులు, ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చారు అనే చెప్పాలి. ఇక షో మధ్యలో సునామి సుధాకర్, అదే షోలో పార్టిసిపేట్ చేస్తున్న శక్ల అనే అబ్బాయి ప్యాంట్ విప్పించి కొంత కామెడీ చేసాడు.
చూడడానికి ఆ సన్నివేశం కొంత నవ్వులు పూయించినా, ప్రస్తుతం ఈ ఘటన కొంత వివాదాస్పదంగా మారింది. అయినా అలా కోట్లాదిమంది ప్రేక్షకులు చూసే షోలో సుధాకర్ ఆ కుర్రాడి ప్యాంట్ విప్పించి షోని అపహాస్యం చేసారని, ఇది ఒకరకంగా తప్పే అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కేవలం ఈ విషయం ఒక్కటే కాదని, గత కొద్దిరోజులుగా జబర్దస్త్ లో చేస్తున్న కొన్ని స్కిట్స్, కొందరి మనోభావాలను కించపరిచేవిగా ఉంటున్నాయనేది వారి ఆరోపణ. ఇక ఇటువంటి ఘటనలపై సదరు టివి ఛానల్ వారు కూడా పునరాలోచించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇకపోతే ఈ స్కిట్ పై కొందరు టివి యాక్టర్లు కూడా రియాక్ట్ అయ్యారని, ఇటువంటివి చేయడం ఒకరకంగా కరెక్ట్ కాదంటూకూడా వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here