ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు….ఏంటో తెలుసా? 

0
76

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా, మున్నా సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడుగా అరంగేట్రం చేసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, పివిపి, దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా తమ బ్యానర్లపై రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా మహర్షి. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా కావడంతో అటు సూపర్ స్టార్ ఫాన్స్ లో మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ సినిమాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన సినిమా ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం దాదాపుగా 70 శాతానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అందుతున్న ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

Image result for maharishi mahesh babu

అదేమిటంటే, రాబోయే న్యూ ఇయర్ రోజున ఈ మహర్షి సినిమాకు సంబంధించి ఒక న్యూ పోస్టర్ ని విడుదల చేయాలని భావిస్తోందట సినిమా యూనిట్. అంతేకాదు మహేష్ బాబు కూడా గత కొద్దిరోజులుగా తన సోషల్ మీడియా వేదికల్లో కేవలం తన ఫ్యామిలీకి సంబందించిన న్యూస్ మాత్రమే పోస్ట్ చేస్తుండడంతో అయన ఫ్యాన్స్ న్యూ ఇయర్ కి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా పోస్టర్ విడుదల చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికల్లో ఆయనకు విపరీతంగా మెసేజెస్ చేస్తున్నారట అయన అభిమానులు. అయితే నిజానికి యూనిట్ కూడా ఎప్పటినుండో ఆ ఆలోచనలో ఉందని, కాబట్టి ఈ జనవరి ఒకటిన తప్పకుండా మహర్షిలోని ఒక న్యూ లుక్ పోస్టర్ ఫాన్స్ ని ఖుషి చేయడం ఖాయమని అంటున్నాయి సినిమా వర్గాలు. కాగా దీనిపై యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి వుంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే సూపర్ స్టార్ ఫాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here