సూపర్ స్టార్ ` దర్భార్`ఫస్ట్ లుక్ సూపర్…….

0
25

సూపర్ స్టార్ రజిని కాంత్ ఈపేరు తెలియని ఎవరు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగ అభిమానులు ఉన్నారు. ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది.ఇటీవల ప్లాప్ లతో సతమతమవుతున్న రజినీకాంత్ `గత సంవత్సరం `పేట` సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. తాజాగా రజిని కాంత్ తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. డైరెక్టర్ ఎ.ఆర్ మురుగుదాస్ తో రజినీకాంత్ సినిమాని ప్రకటించారు. ఇది` తలైవాకు `167వ సినిమా. ఈ చిత్రానికి టైటిల్ మంగళవారం ప్రకటించారు. ` దర్బార్ ` అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టారు. అంతేకాకుండా ఈ చిత్రాల్లో రజినీకాంత్  ఫస్టులుక్ కూడా విడుదల చేశారు.

`దర్భార్ ` ఫస్టులుక్ పోస్టర్ రజిని స్టైల్లో  అద్భుతంగా  ఉంది. అభిమానులు మంచి కిక్ ఇచేలా ఉంది. ఈ చిత్రంలో రజినీకాంత్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. 1980ల బ్యాక్డ్రాప్ లో చిత్రం ఉంటుంది. ఇవే విషయాలు పోస్టర్ ప్రతిబింబిస్తున్నాయి. రజినీయూకంత వెనక రైఫిల్స్, స్నిఫెర్ డాగ్, పోలీస్ బెల్ట్, ఐపీఎస్ బ్యాడ్జ్, బేడీలు ముఖ్యంగా గేట్ వే అఫ్ ఇండియా కనిపిస్తున్నాయి. వీటిననింటిని ముఖ్యంగా పోస్టర్ పై ఇంగ్లీష్ లో రాసిన ` నన్ను మంచివాడిలా చూడాలనుకుంటున్నారో లేదంటే చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా ఉండాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి` అనేవాక్యం సినిమాపై ఆసక్తిని రేవుతోంది. కాగా, ఈ తెలుగు, తమిళ్  భాషల్లో తెరకెకెక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here