మనవరాలిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్ భార్య సురేఖ….ఎందుకో తెలుసా?|telugugaramchai

0
91
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ప్రస్తుతం ఒక ఆనందకర వార్త ఒకటి అయన కుటుంబాన్నీ  మాత్రమే కాదు, యావత్ మెగా అభిమానులందరినీ ఆనందోత్సాహాలతో ముంచెత్తుతోంది. మ్యాటర్ ఏంటంటే, కొన్నాళ్ల క్రితం కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకున్న అయన చిన్న కూతురు శ్రీజ, నిన్న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ వార్తతో చిరంజీవి, సురేఖ దంపతులు మరియు మొత్తంగా ఆ కుటుంబంలోని వారందరు ఆనందోత్సహాల్లో మునిగిపోయారట. అయితే ఈ విషయంపై మెగాస్టార్ భార్య సురేఖ కొంత ఆవేదనకు లోనయ్యారట. ఓవైపు కూతుళ్లు, బిడ్డలకు జన్మనిస్తుంటే, మరోవైపు చరణ్ మరియు ఉపాసన దంపతులు ఆ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో లోలోపల కుమిలిపోతున్నారట.
అంతేకాక ఇటీవల ఈ విషయం తన సన్నిహితులకు చెప్పుకున్న సురేఖ గారు, ఎప్పటికి తాము చరణ్ బిడ్డలను ఎత్తుకుంటామో అని మధనపడుతున్నారట. ఇక చిరంజీవి కూడా పైకి కనపడనప్పటికీ అయన కూడా ఈ విషయంపై ఒకింత లోలోపల కుమిలితున్నారని సమాచారం. అయితే చరణ్ కెరీర్ పరంగా సినిమాలతో ముందుకుసాగుతుంటే, ఉపాసన కూడా తమ వ్యాపారాలపై దృష్టిపెట్టడంతో, ఇపుడు ఒకవేళ పిల్లలను కంటే వారికీ తామిద్దరం సరిగ్గా అంబాటులో ఉండకపోగా, వారి బాగోగులు కూడా చూసే అవకాశం ఉండకపోవచ్చని భావించి కొన్నాళ్లవరకు తమకు పిల్లలు వద్దు అనుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారట ఉపాసన. అయితే కేవలం అత్తమామలు మాత్రమే కాదు, తన తల్లితండ్రులు కూడా తామిద్దరినీ పిల్లల విషయమై ఇకనైన సరైన నిర్ణయం తీసుకోమని కోరుతున్నారని ఉపాసన చెపుతున్నారట. అయితే అతి త్వరలో పిల్లల విషయమై తాను మరియు చరణ్ సరైన నిర్ణయం తీసుకుని మెగాకుటుంబంలో ఆనందం నింపుతామని ఆమె చెప్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here