స్వయం కృషి చైల్డ్ ఆర్టిస్ట్ అర్జున్ ని ఇప్పుడు చూస్తే మతిపోవలసిందే!

0
70
సినిమా ఇండస్ట్రీకి చిన్నవయసులో వచ్చి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆపై కొన్నాళ్ళకు పెరిగి పెద్దయ్యాక నటులుగా మారి మంచి పేరు సంపాదించినవారు కొందరైతే అదేవిధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి, అనంతరం సినిమాల్లో కనపడకుండా తమకు నచ్చిన ఇతర వృత్తుల్లో సెటిల్ అయిన వారు మరికొందరు వున్నారు అని చెప్పాలి. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అలా చిన్నప్పుడు బాల నటుడిగా నటించి, ఇప్పుడు కనుమరుగయిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. 1980ల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విజయశాంతి హీరోయిన్ గా కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్వయంకృషి. ఇక ఆ సినిమా పాటలు కానీ లేదా సినిమా కానీ టివిలో వేస్తే ఇప్పటికీ మనలో చాలామంది చూస్తూ వుంటారు. మన అందరిని అంతలా ఆకట్టుకుంది ఆ సినిమా. ఇక ఆ సినిమాలో చిరంజీవి కొడుకుగా(చెల్లెలి కొడుకు)గా నటించిన బాల నటుడు అర్జున్ అందరికి తెలిసే ఉంటాడు. అయితే అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటి దర్శకుల చూపు అర్జున్ పై పడింది. ఇక ఆ తరువాత అర్జున్ కృష్ణ, శ్రీదేవి నటించిన పచ్చని కాపురం, మా వారి గోల, శోభన్ బాబు మరియు సుహాసిని నటించిన ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించాడు.
అంతేకాదు అప్పట్లో కొన్ని కన్నడ మరియు సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అర్జున్ ఆ తరువాత తన స్వస్థలమైన ముంబై కి వెళ్ళిపోయాడు. అయితే చిన్నప్పుడు చూడడానికి ఎంతో ముద్దుగా ఉండడంతో ఆ బాలుడుని సినిమాల్లోకి తీసుకువచ్చామని, అయితే ఆ తరువాత అర్జున్ కు పై చదువుల నిమిత్తం అతడిని విదేశాలకు పంపామని అయన తల్లితండ్రులు చెపుతున్నారు. ఇక ప్రస్తుతం అర్జున్ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తూ తమ కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాడని, అంతేకాక అర్జున్ కు ప్రస్తుతము సినిమాల్లో నటించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని అయన కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here