భర్త హరీష్ రావు గురించి సంచలన కామెంట్స్ చేసిన ఆయన భార్య!

0
156
తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గత ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్యెల్యేగా గెలిచిన కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావు పై అక్కడి ప్రజల్లో మంచి పేరుంది. అయన ఎప్పుడూ ప్రజాసంక్షేమం కోసం పని చేసే వ్యక్తి అని, అటువంటి నాయకుడు మరొక్కసారి అక్కడ ఎమ్యెల్యే కావడం ఖాయమని కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు చెపుతున్నారు. నిజానికి మామయ్య కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన హరీష్ రావు మొదటినుండి ఏ విషయాన్ని అయినా కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడే మనస్తత్వమని, నిజానికి ఈ రోజున అయన ఈ స్థాయిలో ఉండడానికి కొంత కారణం అలా మాట్లాడే తత్వమేనని అయన అనుచరులు మరియు భార్య చెపుతున్నారు. ఇక మరొక రెండు రోజుల్లో ఎన్నికలు ఉండడంతో భర్త హరీష్ రావుతో కలిసి అయన భార్య శ్రీనిత కూడా ఎలక్షన్ కాంపెయిన్ లో పాల్గొన్నారు.
అంతేకాక అయన వెళ్లిన ప్రతీచోటకు ఆమెకు కూడా వెళ్లి, తన ప్రసంగాలతో అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక నిన్నటి సిద్ధిపేట సభలో మాట్లాడిన శ్రీనిత, తన భర్త హరీష్ రావు గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ఆమె మాట్లాడుతూ, హరీష్ రావు గారు ఎంతలా ప్రజల గురించి ఆలోచిస్తారంటే, మాకున్న ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఏమి చదువుతున్నారో కూడా ఆయనకు తెలియదు. తెల్లారి లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఎక్కువగా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసారని, ఆయన ఒక్కోసారి సమయానికి భోజన నిద్రాదులను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక హరీష్ రావు గారు గత ఎన్నికల్లో గెలిచాక ఇప్పటివరకు ఇక్కడ ఎంత అభివృద్ధి చేసారో మీ అందరికీ తెలుసు, కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఆయన్నే గెలిపించమని కోరుతున్నట్లు ఆమె చెప్పారు. నిజానికి ఎప్పుడూ కుటుంబం గురించి కంటే, తన నియోజకవర్గ ప్రజలు కూడా నా కుటుంబమే అని వ్యవహరించే హరీష్ రావు వంటి గొప్ప వ్యక్తికి భార్య అయినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here