సంచలనం సృష్టిస్తోన్న టీడీపీ నేత రాసలీలలు…… షాక్ లో చంద్రబాబు!

0
83
గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం పవన్ జనసేనతో కొంత తో పొత్తు పెట్టుకోవడం అలానే రాష్ట్రం అత్యంత విపత్కర పరిస్థితుల్లో విడిపోవడం వంటి కారణాల వలన గెలిచిందని, అయితే ఈసారి మాత్రం టీడీపీకి గెలుపు అంత సులువు కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న చంద్రబాబు, ఆ తరువాత మాట మార్చి ప్రత్యేక ప్యాకెజీకి మొగ్గు చూపి, దాని వల్ల కూడా రాష్ట్రానికి సరైన విధంగా మేలుచేయలేకపోయారు. ఇక అప్పటినుండి టీడీపీ ప్రాభవం రోజురోజుకు తగ్గిపోతోంది అనే చెప్పాలి. ఇక అప్పట్లో తన అవసరం కోసం ఎన్డీయేలో భాగస్వామి అయిన టీడీపీ, ఆ తరువాత కేంద్ర ఎన్డీయేలోని బీజేపీ పార్టీ ఏపీ రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందని వారు ఎన్డీయే కూటమి నుండి బయటకు రావడం జరిగింది. ఇటువంటి అపఖ్యాతులతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో టీడీపీ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి అని ఆ పార్టీ నాయకులు మధనపడుతున్న సమయంలో ప్రస్తుతం ఒక టీడీపీ నాయకుడు చేసిన పనికి వారి పరిస్థితి మరింత దిగజారిపోయిందనే చెప్పాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే,
విశాఖపట్టణం తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు నెల్లి సాధురావు రాసలీలలు నేడు బయటపడ్డాయి. రకరకాల ప్రభుత్వ పథకాల కోసం పలువురు మహిళలు ఈయన్ను ఆశ్రయిస్తుండటంతో, దాన్ని ఆసరాగా చేసుకున్న సాధురావు ఆ మహిళలను లొంగదీసుకుంటూ రాసలీలలు మొదలు పెట్టాడు. అయితే ఈ వ్యవహారం బయటపడడంతో కొంతమంది ఈయన రాసలీలకు చెక్ పెట్టాలని సీక్రెట్ కెమెరాతో ఆ తతంగమంతా రికార్డ్ చేసారు .ఇప్పుడా రాసలీలల వీడియో సోషల్ మీడియాలో, అలానే పలు మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి తెలుగుదేశం నాయకులు , కార్య కర్తలు షాక్ అయితే, మిగతా పార్టీలు మాత్రం ఈ వీడియోలతో తెలుగుదేశం పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ఈ రాసలీలలన్ని ఎక్కడో చేయడం లేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోచేయడం పార్టీ కి మరింత చెడ్డ పేరును తీసుకొస్తున్నాయి. మరి దీనిపై పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. ఇక ఈ వీడియోతో ప్రజల్లో టీడీపీ పై మరింత చెడ్డ పేరు వచ్చినట్లే అని, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here