టిడిపి ఎంపీ మురళి మోహన్ కు భారీ షాక్…..

0
32

జయభేరి గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2కోట్లు నగదు స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదు. ఈ వ్యవహారంలో సినీనటుడు మరియు టిడిపి ఎంపీ అయినా మురళి మోహన్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నగదు తరలిస్తూ ఉండగా పట్టుబడిన నిమ్మలూరి శ్రీ హరి, ఆవురి పాండరి సహా ఆరుగురిపై ఐసీసీ సెక్షన్ 171బి, 171ఈ, 171సి, 171ఎఫ్ సెక్షన్ ల ప్రకారం కేసులు నమోదు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిసనర్ సజ్జనార్ తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 21 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

ఈ మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా అపూరి శ్రీ హరి , ఆవురి పాండరి అనుమానంగా కనిపించారని , వారి దగ్గర ఉన్న బాగ్ లు తనిఖీ చేయగా అందులో 2కోట్ల డబ్బు లభ్యమయ్యాయి. వారు ఆ డబ్బు జయగ్రూప్ అధినేత యలమంచి మురళి కృష్ణ ఇచ్చేందుకు తీసుకు వెళ్తున్నట్టు చెప్పారు ఆయన నుంచి ఎంపీ మురళి మోహన్ కు అందజేస్తారని వారు అన్నారు. ఈ కేసులో నిమ్మలూరి శ్రీ హరి, పండరి, జగన్, ధర్మరాజు, మురళి కృష్ణ, ఎంపీ మురళి మోహన్ లపై కేసులు నమోదు చేశాం` అని సజ్జనార్ మీడియాకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here