నాగబాబు పై టిడిపి లీడర్ శోభారాణి సంచలన కామెంట్స్ !

0
129
మెగా మరియు నందమూరి కుటుంబాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకోవడం తరచు చూస్తుంటాం. ఇక ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, యువరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు ఫ్యామిలీల అభిమానుల మధ్య మరింత దుమారాన్ని రేపాయి. ఇక గత కొద్దిరోజులనుండి విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై టిడిపి నేత శోభారాణి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఒకప్పుడు పీఆర్పీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన శోభా రాణి, అప్పట్లో ఆ పార్టీ నేతలపై ఎవరైనా ఏమైనా అంటే వారికీ గట్టిగా తన మాటలతో బదులిచ్చేవారు. ఇక ఆపార్టీలో చిరంజీవి గారు ఆమెకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చి ఆమెకు సముచిత స్థానం కల్పించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి 2009 ఎన్నికల్లో పీఆర్పీ ఘోర పరాజయం పాలవడంతో, కొంత కృంగిపోయిన మెగాస్టార్, ఆ తరువాత పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పార్టీ కాంగ్రెస్ లో కలవడంతో పీఆర్పీ నేతలు పలు ఇతర పార్టీల్లో చేరారు. ఇక అప్పటినుండి కొన్నాళ్ల పాటు కనుమరుగైన శోభారాణి, ఇటీవల టిడిపిలో చేరి  ఆపార్టీ తరపున పనిచేస్తున్నారు. ఇక కొద్దిరోజులుగా ఆ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న శోభారాణి, ఇటీవల నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని, అయితే తనకు ఒకప్పటి కమెడియన్ బాలకృష్ణ తెలుసునని ఆయనని అవమానించడం ఘోరమని ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తెలిపారు. బాలకృష్ణ గారు ఎవరో తనకు తెలియదని నాగబాబు గారు అన్నారు కదా, మీరు దానిపై ఏమి కామెంట్ చేస్తారు అన్న ప్రశ్నకు బదులిస్తూ, తనకు నాగబాబు గారు అంటే, జబర్దస్త్ నాగబాబు గారు అని మాత్రమే తెలుసునని, చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు అంటే ఎవరో తెలియదని అన్నారు.
మరి నేను ఇలా అంటే మెగాఫ్యాన్స్ కి కోపం రాదా, అయితే ఆ విధంగా బాలకృష్ణ గారు తనకు తెలియదు అని నాగబాబు గారు అనడం నిజంగా దారుణమని, అలా మాట్లాడడం ప్రజల్లో తమపై వున్న అబిమానాన్నని తమకు తామే దిగజార్చుకోవడం అని ఆమె అన్నారు. నిజానికి బాలకృష్ణ గారు ఒక లెజెండ్ అని, తండ్రి శ్రీ ఎన్టీఆర్ వంటి ఒక మహానుభావుడికి పుట్టిన బాలకృష్ణ గారి గురించి విశ్వవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తెలుసునని ఆమె అన్నారు. ఆ విషయం నాగబాబు గారికి కూడా తెలిసినప్పటికీ, అయన అలా బాలకృష్ణ గారిపై చౌకబారు వ్యాఖ్యలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తాం అని అన్నారు. ఇక ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఏపీ రాష్ట్రానికి సిఎం గా వున్న సమయంలో తెలుగు ప్రజలకు ముఖ్యంగా అప్పట్లో సినిమాల్లోకి వస్తున్న చిరంజీవి గారు వంటి ఎందరో కొత్తహీరోలను ప్రోత్సహించి ఏఎన్నార్, కృష్ణ గారు వంటి మరికొందరు సీనియర్లతో కలిసి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్  తీసుకురావడంలో పడిన కృషి తెలుగువారందరికీ తెలుసునని ఆమె గుర్తు చేసారు. అయితే ఎంత ఎదిగినా వొదిగివుండే చిరంజీవి గారు ఎప్పుడు ఇలా వేరే హీరోలపై ఈ విధంగా కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని ఆమె అన్నారు. కాగా శోభారాణి ప్రస్తుతం నాగబాబు పై చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ కొందరు మండిపడుతూ ఆమెపై సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here