నాలుగో టెస్టులో భారీ స్కోర్ దిశగా టీమిండియా… స్కోర్ ఎంతంటే? 

0
79
ఆసీస్‌తో జరుగుతున్న ఆఖరి మరియు నాలుగో టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది టీమిండియా… ఇక భారత బ్యాట్స్ మాన్ లలో నయా వాల్‌ పుజారా 130 నాటౌట్‌ గా నిలిచి మరోసారి అదరగొట్టాడు, మరో బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ (77) కూడా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది…. తొలి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 303/4 పరుగులు చేసింది. పుజారా-మయాంక్ జోడీ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌ వుడ్‌ రెండు వికెట్లు, మిచెల్‌ స్టార్క్‌, నాథన్ లైయన్‌ చెరో వికెట్ తీశారు. ఇదే జోరును కొనసాగిస్తే భారత్‌ భారీ స్కోరును సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్ రాహుల్‌ 9 పరుగుల వద్ద మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు…అనంతరం పుజారా క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న మయాంక్‌కిది రెండో టెస్టే అయినా అనుభవం ఉన్న వ్యక్తిలా బౌలర్లను ఎదుర్కొన్నాడు.
Image result for india vs australia 4th test
ఈ క్రమంలో తన టెస్టు కెరీర్‌లో రెండో అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని శతకం వైపు పరుగులు పెట్టాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత దూకుడు పెంచిన మయాంక్‌ ఎడాపెడా బౌండరీలు బాదడం మొదలెట్టాడు….పుజారాతో కలిసి దాదాపు గంటకు పైగా క్రీజులో కుదురుకున్న మయాంక్‌ను 34 ఓవర్లో లైయన్‌ ఔట్‌ చేశాడు. లైయన్‌ వేసిన బంతిని మయాంక్‌(77) స్టార్క్‌ చేతికిచ్చి ఔటయ్యాడు. మయాంక్‌, పుజారా జోడీ 116 పరుగుల భాగస్వామ్య పరుగులను నెలకొల్పింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ ప్రారంభంలో ఆచితూచి ఆడాడు, అయితే 53వ ఓవర్లో హేజిల్‌వుడ్‌ వేసిన బంతిని వికెట్‌ కీపర్‌ ‌పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ(23) ఔటై నిరాశ పరిచాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రహానె, పుజారాకు కొంత సహకారం అందించాడు అనే చెప్పాలి. ఆసీస్ బౌలర్లతో కాసేపు ఆడుకున్న రహానె 18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఆటలో మొత్తం పుజారానే కనిపించాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతున్నా పుజారా మాత్రం క్రీజులో కుదురుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. పుజారా-విహారి జోడీ తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక పుజారాతో పాటు నాటౌట్ గా హనుమ విహారి 39 పరుగులతో క్రీజ్ లో వున్నాడు….
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here