మూడవ టెస్టులో మెల్లగా పుంజుకుంటున్న భారత్…. 3వ రోజు ఆటలో ఎన్ని పరుగులు చేసారంటే?

0
76
నిజానికి టీమ్ ఇండియా ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదనే చెప్పాలి. ఇక ఒకప్పటి క్రికెట్ గాడ్ సచిన్ నుండి నేటి విరాట్ వరకు కూడా ఎలాగైనా అక్కడ సిరీస్ గెలవాలనే కల మాత్రం కలగానే మిగిలిపోతోంది. ఇక ప్రస్తుతం టీమిండియా-ఆసీస్‌ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 151 పరుగులకే కుప్పకూలింది. 8/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్ ఆది లోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక వారి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు సాధించిన పరుగుల్లో అత్యధిక స్కోర్‌ 22 అంటే టీమిండియా బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీసి తన కెరీర్‌లో బెస్ట్‌ నమోదు చేశాడు. అలానే జడేజా రెండు వికెట్లు, ఇషాంత్‌, షమీ చెరొక వికెట్‌ తీశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆ తరువాత ఆసీస్‌ను ఫాలోఆన్‌ ఆడించడానికి టీమిండియా నిరాకరించి, ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇక  8/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ నాలుగవ ఓవర్ లో తొలి వికెట్‌ కోల్పోయింది.
ఇక 14 ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌(22) పెవిలియన్‌ చేరగా ఐస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక 19వ ఓవర్లో ఉస్మాన్‌ ఖవాజా(21)ను జడేజా తన పదునైన బౌలింగ్‌తో వెనక్కి పంపాడు. దీంతో ఆసిస్‌ 20 ఓవర్లకే మూడు వికెట్లు చేజార్చుకుంది. అప్పటివరకు కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగిన ఆసీస్, 33వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి షాన్‌ మార్ష్‌(19) ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత బుమ్రా బౌలింగ్‌లోనే ట్రావిస్‌ హెడ్‌(20) కూడా పెవిలియన్‌ చేరాడు.  ఆసిస్‌ సారథి టిమ్‌పైన్‌ భారత బౌలర్లను తట్టుకుని కొన్ని ఓవర్ల పాటు క్రీజులో నిలబడినప్పటికీ పరుగులైతే చేయలేదు.  అనంతరం వచ్చిన బ్యాట్స్ మాన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే పైన్‌ సేన ఆలౌటైంది. కాగా ప్రస్తుతం మూడవ రోజు ఆటముగిసే సమయానికి 346 పరుగుల లీడింగ్ తో టీమ్ ఇండియా 54 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కాగా భారత బ్యాట్స్ మాన్ లలో మాయాంక అగర్వాల్ 28 పరుగులతోను, రిషబ్ పంత్ 6 పరుగులతోను క్రీజ్ లో వున్నారు……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here