ఫస్ట్ వన్ డే లో ఇండియా ఘన విజయం…. స్కోర్ ఎంతంటే?

0
85
ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ తో టెస్టులు మరియు వన్డేల సిరీస్ ని కైవశం చేసుకుని మంచి ఊపుమీదున్న టీమ్ ఇండియా, ప్రస్తుతం న్యూజిలాండ్‌ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌ జట్టు  కేవలం 34.4 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక లంచ్ బ్రేక్ తరువాత గ్రౌండ్ లోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌, కొంత సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు. ఫలితంగా మ్యాచ్‌ను 30 నిమిషాలు పాటు నిలిపి వేశారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక ఓపెనర్ ధావన్‌ హాఫ్ సెంచరీ చేయడంతో, టీమిండియా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.
Image result for india vs new zealand
ముందు కాస్త దూకుడుగా ఆడిన టీమిండియా ఓపెనర్లలో  బ్రేక్‌ అనంతరం ఒక ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్‌ విరాట్‌, తో జతకలిసిన ధావన్ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరూ కలిసి స్కోర్ ని పరుగులు పెట్టించారు. విరాట్‌, ధావన్‌ జోడీ కలిసి జట్టుకు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధశతకంచేసే ప్రయత్నంలో 29 ఓవర్లో ఫెర్గూసన్‌‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.  తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు13 పరుగులతో కలిసి ధావన్ 75 పరుగులతో , ఇక్డడరు కలిసి 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here