ఇంటర్ ఫలితాలపై స్పందించిన కెసిఆర్

0
27

తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల తప్పిదాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో జారిన తప్పులపై ప్రగతి భవన్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్,  ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ , ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చాల తప్పులు జరిగాయని. పరీక్షలు రాసిన వారు ఫెయిల్ అవ్వడం, రాయనివారు పాస్ అవ్వడం, టాపర్లకు సున్నా రావడం వంటి విషయాలు వల్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయ్యామని 20 మంది విద్యార్థులు ఆత్మా హత్యలు చేసుకున్నారు.

చనిపోయిన విద్యార్థులకు  తగిన న్యాయం జరగాలని విద్యార్థి సంఘాలు ఆదేశిస్తున్నాయి. ఇంటర్ విద్యాదులకు, వారి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలను విద్యార్థి సంఘాలు ఆదేశిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంతో పాటు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here