ఫిబ్రవరి 1 నుండి తెలుగు ఛానళ్ల ప్రసారాల నిలిపివేత!

0
64
ఇదివరకు కస్టమర్లకు సెల్ ఫోన్ కాల్స్ మరియు ఇంటర్నెట్ ధరలను చాలావరకు అందుబాటులోకి తెచ్చిన టెలీకాం అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), ప్రస్తుతం కేబుల్ వినియోగదారులకు మరింత సౌకర్యం కలిగించనుంది. వారి సరికొత్త ఆదేశాల ప్రకారం ఇకపై కేబుల్, లేదం డిటిహెచ్ కస్టమర్ తమకు నచ్చని ఛానల్స్ చూడనవసరం లేదని, అలానే కేవలం తాము చూడదల్చిన ఛానల్స్ కు మాత్రమే డబ్బులు చెల్లించవచ్చని రెండు నెలల క్రితం నూతన ఆదేశాలు జరీ చేసింది. అయితే ఈ విషయమై కొంత వ్యతిరేకత చూపుతున్న కేబుల్ ఆపరేటర్లు ఎట్టకేలకు రాబోయే ఫిబ్రవరి 1 నుండి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వినోద ఛానళ్ల ప్రసారాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
Related image
నిజానికి ట్రాయ్ వారు ప్రవేశపెట్టిన నూతన విధానం కస్టమర్స్ కు ఒకరకంగా మేలు చేసినప్పటికీ, కొన్ని టెలివిజన్ ఛానల్స్ వారి అధిక ధరల వలన మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. అంతేకాక వారి అధిక ధరలవలన తమకు మరింత భారం అవుతుందని, ఆ కారణంగానే వచ్చే ఫిబ్రవరి 1 నుండి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వినోద చానళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కేబుల్ ఎంఎస్వో ల అధ్యక్షుడు సుభాష్ తెలిపారు. అయితే వినియోగదారుల కోరికమేరకు అవి ప్రసారం చేస్తామని, కానీ ఆయా ఛానల్స్ చార్జీలు భరించడానికి వారు సిద్ధమైతే తమకు ప్రసారం చేయడానికి అభ్యంతరం లేదని అయన అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here