టిక్ టాక్ యాప్ తో యువతలో ఉత్సహం చివరికి ఏం జరుగుతోంది ? Telugugaramchai

0
83

ఇటీవల కాలంలో వచ్చిన యాప్స్ లో టిక్ టాక్ ఒకటి భారీగా పాపులర్ అయ్యింది. నేటి యువత వాళ్ళ పాపులారిటీ కోసం ఒకరిని మించి మరొకరు భారీగా  రెచ్చిపోతున్నారు. లైకులు , ఫాలోయింగ్ కోసం ఎలా పడితే అలా విచ్చల విడిగా వీడియోలు చేస్తూ పోస్టులు  చేస్తున్నారు. ఈ జనరేషన్ లో మంచి కోసం వచ్చే యాప్స్ లను  యువత ఎక్కువగా చెడుకి ప్రభావితులు అవుతున్నారు. ఇండియా లో టెక్నాలజీ రోజు రోజుకి  పెరుగుతుంది అంతే తరహాలో యువత కూడా ఆ టెక్నాలజీ ని మంచి కోసం కాకుండా చెడు కోసం ఎక్కువగా  ఉపయోగిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చినట్టు వీడియోస్ లు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు ఐతే ఏకంగా డ్రెస్సెస్ లు రిమూవు చేసేస్తున్నారు. ముద్దులు పెట్టుకోవడం,కౌగిలించుకోవడం, స్కర్ట్ లు రిమూవు చేయడం ఇలా చెప్పుకుంటే పొతే చాలానే ఉన్నాయ్. ఇంత జరుగుతున్నా కూడా ఇలాంటి యాప్స్ పైన ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు గా ఉంది. ఇంకా ఇలానే కొనసాగితే రేపటి తరం యువత కూడా చెడిపోతుంది .రేపటి తరం యువతకు మనం మంచి చేయకున్నా మరేం పర్వాలేదు కానీ చెడు చేయకుండా , రాబోయే తరం చెడిపోకుండా తగిన మంచి  సలహా సూచనలు ఇస్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి.  . తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తన విధి విధానాలను గమనిస్తూ మంచి మార్గంలో నడిచేలా తమవంతు కృషి చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యాప్స్ ల  పైన స్పందించి తగిన కఠిన చర్యలు తీసుకోని రేపటి తరానికి మేలు జరిగేలా  సహకరించాలని ఆశిస్తున్నాము .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here