ఎస్సై ,కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు చేసిన తెలంగాణ పోలీసు శాఖ .Telugugaramchai

0
48
ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ పోలీసుశాఖ  ఎస్సై , కానిస్టేబుల్ అభ్యర్థుల  తుది  రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఎస్సై (సివిల్) రాత పరీక్షా నిర్వహిస్తారు. ఏప్రిల్ 27 ఎస్సై (ఐ టీ &  కమ్యూనికేషన్ ), ఎస్సై పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 28 తేదీన కానిస్టేబుల్ (ఐ టీ &సివిల్ & కమ్యూనికేషన్) రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకా మే 19 వ తేదీన కానిస్టేబుల్ డ్రైవరు  మరియు మెకానిక్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్సై,కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి  సంబంధించి ఇప్పటికి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి . ఫిజికల్ ఈవెంట్లు ముగియగానే రాత పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబందించిన హాల్ టికెట్లను కూడా సిద్ధం చేసినట్టుగా అధికారులు వెల్లడించడం  జరిగింది.
తెలంగాణాలో మొత్తం 18,428 పోస్టుల భర్తీకి గాను గతేడాది మే మే 31 నోటిఫికేషన్ విడుదల అయినా సంగతి తెలిసిందే. వీటిలో 17,156 కానిస్టేబుల్ కాగా , 1272 ఎస్సై పోస్టులు ఉన్నాయి . ఎస్సై (సివిల్ ) పోస్టులకు ఆగష్టు 26 న,ఎస్సై (ఐ టీ &కమ్యూనికేషన్ ),ఏఎస్సై పోస్టులకు సెప్టెంబర్ 9 న ప్రిలిమినరీ రాత పరీక్షలు  నిర్వహించడం జరిగింది. ఇకా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 30 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడం జరిగింది.
అయితే ఎస్సై ప్రాథమిక పరీక్షలో కొన్ని ప్రశ్నలపై అభ్యతరం వ్యక్తం చేస్తూ కొంత మంది హైకోర్టు కు ఆశ్రయించగా, హైకోర్టు కొత్త మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాతే ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించాలని గతంలో  తీర్పునిచ్చింది. దింతో  పోలీసు నియామకాల్లో జాప్యం చోటు చేసుకుంది . తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ని నిలిపివేస్తూ , హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఫిజికల్ ఈవెంట్లు (దేహదారుఢ్య పరీక్షలు ) నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. దింతో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 3,77,770 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 11 తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా మార్చి  16 తేదీ వరకు దేహ దారుడ్య పరీక్షలు కొనసాగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here