మీరు తినేవి ప్లాస్టిక్ రైస్ అవునా? కాదా? అనేది ఇలా చెక్ చేయండి….!

0
22
ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవితంలో ప్రతిఒక్కటి నకిలీలుగా తయారవుతోంది. ఇక ఇటీవల ప్రశాంతంగా తిండి కూడా తినడానికి కూడా లేకుండా వాటిలో కూడా కల్తీలు మొదలయ్యాయి, ఇక ఏకంగా మనం తినే అన్నం కూడా ప్లాస్టిక్ బియ్యం పేరుతో మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. అయితే మనం తినే బియ్యం నిజంగా కల్తీనా, కాదా అనేది కొన్ని పద్దతుల ద్వారా తెలుసుకోవచ్చని ఆహార నిపుణులు కొన్ని సూచనలు చేసారు. అవి ఏంటో, ఇప్పుడు చూద్దాం… ముందుగా ఒక చిన్న పాత్రలో నీరు పోసి అందులో చెంచాడు బియ్యం గింజల్ని వేసి కదిలించాలి. నకిలీ బియ్యం అయితే అవి నీటిపైకి తేలతాయి. నిజమైన బియ్యం అడుగుకు చేరుతుంది. పైగా ఇలా నీటిలో అసలైన బియ్యం వేసి కదిపితే నీటి రంగు మారిపోవడం కూడా గమనించవచ్చట. అయితే ప్లాస్టిక్‌ రైస్‌ అలా ఉండదు, బియ్యాన్ని వండుతున్నప్పుడు పొంగు వచ్చి గంజి కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్‌ బియ్యం అయితే ఇలా ఉండదు, బియ్యాన్ని ఉడికించిన తర్వాత దాన్ని తీసుకువెళ్లి ఓ డబ్బాలో వేసి ఉంచండి.
Image result for plastic rice
రెండు మూడు రోజులు ఆగి చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఉడికిన బియ్యం రెండో పూటకే పాడవడం మొదలవుతుంది. రెండు మూడు రోజులంటే ఫంగస్‌ వచ్చేస్తుంది. అదే ప్లాస్టిక్‌ బియ్యం అయితే దానికి ఎటువంటి ఫంగస్‌ పట్టదు. అది ఎన్ని రోజులు అయినా అలానే ఉంటుంది. ఇక కొన్ని బియ్యం గింజలను కాల్చి చూడండి, అవి ప్లాస్టిక్‌ గింజలు అయితే కరిగి ముద్దలా అవుతుంది. పైగా ప్లాస్టిక్‌ కరుగుతున్నప్పుడు గాఢమైన వాసన వస్తుందన్న విషయం పసిగట్టవచ్చు… అదే అసలైన బియ్యం అయితే కాలిపోతాయి, పైగా ప్లాస్టిక్‌ వాసన కూడా రాదు. ఇకపోతే ఒక చెంచాడు బియ్యాన్ని గుండ్రాయి తీసుకుని నూరి చూడండి, మెత్తటి పొడిగా మారుతుంది. ప్లాస్టిక్‌ బియ్యం ఇలా అవదు. ప్లాస్టిక్‌ బియ్యం, సాధారణ బియ్యం రెండూ కూడా ఒకటే ఉష్ణోగ్రత వద్ద ఉడకవు. నిజమైన బియ్యంపై అయోడిన్‌ టింక్చర్‌ చుక్కలు వేస్తే నీలి రంగులోకి మారతాయి. ప్లాస్టిక్‌ బియ్యం రంగు మారడం జరగదు. కాబట్టి ఈ విధమైన చిన్నపాటి టెస్టులు చేసి చూడడం వలన ప్లాస్టిక్ బియ్యానికి చెక్ పెట్టవచ్చు……