విడుదలైన వినయ విధేయ రామ తందానే సాంగ్ వీడియో….యూట్యూబ్ లో వైరల్!

0
21
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల లెజెండ్, జయ జానకి నాయక సినిమాలతో విజయాలు అందుకున్నమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ. ప్రారంభం నుండి మెగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించినా ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు సినిమా పై అమాంతం ఆ అంచనాలను మరింత పెంచాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ మరియు కేటీఆర్ అతిథులుగా విచ్చేయగా ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Related image
ఇకపోతే ఈ సినిమాలోని ఐదు పాటల్లో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని తందానే అనే పాట బాగా ఆకట్టుకుంది. ఇక ఆడియో లో మొదటగా వచ్చే ఈ పాట వీడియో ప్రోమోని కాసేపటి క్రితం చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోని బట్టి చూస్తే, ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ సాంగ్ అని అర్ధం అవుతోంది. కుటుంబంలోని బంధాలు మరియు అనుబంధాలను తెలుపుతూ సాగె ఈ సాంగ్ సినిమాలో ఎంతో కీలకమని యూనిట్ సభ్యులుచెపుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో  యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దుమ్మురేపుతోంది.