RRR లో చరణ్ ఫ్యాన్స్ కు అది ఫుల్ కిక్ ఇచ్చే యాక్షన్ సీన్ అట!

0
53
గత ఏడాది విడుదలైన రంగస్థలం సినిమాతో మంచి హిట్ కొట్టిన రామ్ చరణ్, ఇటీవల విడుదల అయిన వినయ విధేయ రామ సినిమాతో కొంత ఢీలా పడ్డాడు అని చెప్పవచ్చు. ఇకపొహతే ప్రస్తుతం అయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని టాక్. చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఒక రౌడీ గ్యాంగ్ ను అడ్డుకోవడం, ఆ గ్యాంగ్ ని తన రేంజ్ తో చితకొట్టే సీన్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.
Image result for ram charan rrr movie
ఇక ఈ యాక్షన్ సీన్ లో వందలమంది ఫైటర్లు పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలిచిపోతుందని చెబుతున్నారు యూనిట్. ఇక ఈ సీన్ కు సినిమా హాల్స్ లో చరణ్ అభిమానులు విజిల్స్ వర్షం కురిపించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here