ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయం…. దాని ప్రత్యేకతలు… చూస్తే ఆశ్చర్యపోతారు!

0
92
కంబోడియాలోని ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలిస్తే ఆశ్చర్యంవేయక మానదు… ఇక అక్కడ దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణం, 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం, చుట్టుప్రక్కల మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం, ఆకట్టుకునే అద్భుతమైన శిల్పకళ, పచ్చని పసిరిక, నీటి గలగలలు వెరసి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయంగా పేరుగాంచింది అంగ్ కోర్ వాట్… ఇక దీని ప్రత్యేకత ఏంటంటే, దీనికి వందల ఏళ్ల నాటి  అద్భుత చరిత్ర కలిగివుండడం….ఇక యూరోపియన్ల వలసల అనంతరం కంబోడియాగా రూపాంతరం చెందింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు రెండవ సూర్యవర్మన్. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. ప్రస్తుతం అంగ్ కోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తోంది….
Image result for angkor wat temple
ఇక ఆలయాల నగరంగా పేరుగాంచిన అంగ్ కోర్ వాట్ ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అసలు అంగ్ కోర్ వాట్ అంటేనే, దేవాలయాల నగరం అని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.  ఇక కేవలం హిందూ మతంలోనే కాక ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా  అంగ్ కోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి, ఇక అక్కడే అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఇది ఏకంగా 650 అడుగుల అంటే 200 మీటర్లు వెడల్పుతో 13 అడుగుల 4 మీటర్ల లోతుతో ఆలయం చుట్టూరా ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత కూడా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం. ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి…..
Image result for angkor wat temple
అలానే ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అయితే ఖ్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది. ఆ సమయంలోనే.. అంటే సుమారు 14వ శతాబ్దం సమయంలో అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అంగ్ కోర్ వాట్ లో అప్పటి నుండి ఉన్న శిల్పాలను, ఆలయాలను ఏమాత్రం మార్చకుండా కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగ్ కోర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఆలయ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసి అందరికి తెలిసే ప్రయత్నాలు ప్రారంభించింది ఆలయ నిర్వాహకబృందం…..!!!
Image result for angkor wat temple

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here