నిజమైన స్నేహానికి మారుపేరుగా నిలిచే ఐదు రాశి చక్రాలు!  

0
73
 మనలో చాలా మంది మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి ఒడిడుకులు అలానే మంచి చెడులు జరుగుతాయి అనేది తెలుసుకోవాలనే ఉబలాటంతో రాశి ఫలాలను వాటి వలన కలిగే లాభ నష్టాలను ఎప్పటికపుడు తెలుసుకుంటూ వుంటారు. ఇకపోతే రాశి ఫలాలు అనేవి ఎంతవరకు నమ్మవచ్చు అనే విషయం పక్కన పెడితే, మన హిందూ దేశంలో వీటిపై నమ్మకం విపరీతంగా ఎక్కువ. ఇక కొందరు  పండితలు చెపుతున్న ప్రకారం, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక ఐదు రాశుల వారు, తమను నమ్మిన వారిని, అంటే స్నేహంగా వెలిగే వారికీ అవసరమైతే తమ ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనుకాకాడరట.  ముందుగా వృషభ రాశి వారి స్నేహం నిజమైనది, నిబద్ధతతో కూడుకున్నది వంటి ఇతర భారీ పదాలతో వర్ణించేకన్నా, ఇతరుల మనసును చదవగలిగి, వారి స్నేహితుల భావోద్వేగాలను, మరియు అవసరాలను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని మాత్రం గట్టిగా చెప్పవచ్చు.
Related image
మీ అవసరాలకు అన్ని దారులు మూసుకుపోయి ఉన్నట్లు కనిపించినా, మీరు ఊహించని విధంగా మీకొక దారిని చూపగల వ్యక్తిగా, ఆపద్భాందవునివలె ఆపన్నహస్తం అందించేవారిలా ఉంటారు. కష్టకాలంలో వెన్నంటి నిలుస్తూ, వారి తెలివితేటలతో సమస్యను పరిష్కరించగలిగేలా ఎత్తులు వేయగల శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించగలరు. క్రమంగా స్నేహితులకు బెస్ట్ బడ్డీలుగా ఉండగలరు. ఇక కన్యా రాశి వారు నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉంటారు. క్రమంగా తమ సంబంధ బాంధవ్యాలను కాపాడుకునే కోణంలో మనస్పూర్తిగా అడుగులు వేస్తుంటారు. వీరి కోపమే వీరి ప్రధాన శత్రువుగా ఉన్నప్పటికీ, వీరి ప్రతి ఆలోచనలోనూ ఒక నిర్దిష్టమైన కోణం ప్రస్పుటంగా దాగి ఉంటుంది. వీరికి సులభంగా క్షమించే మనస్తత్వం ఉన్నా, సమస్య పరిష్కార మార్గాల గురించిన ఆలోచనలు చేస్తుంటారు. ఎల్లప్పుడూ వారి స్నేహితుల పట్ల నిజాయితీతో ఉంటారు. త్యాగానికి మారుపేరుగా కూడా కనిపిస్తారు.  ఇక మరొక రాశి వృశ్చికం, విశ్వసనీయత, నిజాయితీకి మారుపేరుగా ఈ రాశి వారు ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు
Related image
వీరు ఏం చేసినా, ఎందులో అడుగుపెట్టినా పరిపూర్ణ దృక్పధంతో ఉంటారు. అది స్నేహమైనా, ప్రేమ అయినా, ఏ ఇతర సంబందాలైనా సరే. ఈ కారణం చేత ఒక్కోసారి తమ ప్రశాంతతను కూడా పూర్తి స్థాయిలో కోల్పోవలసి ఉంటుంది. తమ స్నేహితులు తమ పట్ల నిజాయితీతో లేకపోయినా, అసౌకర్యాన్ని కలిగిస్తున్నా, తాము మాత్రం నిబద్దతను కోల్పోరు. వీరిలోని ఈ భిన్న వైఖరి కారణంగా, ఎవ్వరు కూడా వీరిని కోల్పోయేoదుకు సిద్దంగా ఉండరు. పైగా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం, అవగాహన వీరి సొంతం. ఇక మరొకటి మకర రాశి. ఈ రాశి వారు ఒకరకంగా తమను తాము కంటే, తమ మిత్రులు మరియు మన అనుకున్న వారినే ప్రాణంగా ఇష్టపడుతుంటారు. ఇక వీరి స్నేహంలో ఎటువంటి కల్మషం వుండదు. అయితే ఐదు రాశుల్లో మకర రాశి వ్యక్తిని స్నేహితుడిగా పొందిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడనే చెప్తున్నారు పండితులు.
Related image
ఇక అవసరం అనుకుంటే వీరు ప్రాణం సైతం మిత్రునికి ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించారని, అంతేకాక నీటి, నిజాయితీ, ధర్మం ఎల్లపుడూ వీరికి రక్షణగా ఉంటుందని అంటున్నారు. ఇక ఆఖరిది కుంభ రాశి. ఈ రాశి వ్యక్తులు పైకి కొంత కోపిష్టిగా కనపడిగా లోలోపల మాత్రం వెన్న వంటి కరిగిపోయే మనస్తత్వం కలవారట. ఇక ఈ రాశి వ్యక్తిని స్నేహితుడిగా పొందడం వలన, అతడు తమ వారితో సమానంగా స్నేహితుడిని చూస్తుంటారని, అంతేకాక స్నేహితులకు కష్టనష్టాల్లో తోడు నీడగా ఉంటూ, వారికీ తమ వంతు భరోసాని ఇస్తుంటారని,అయితే వీరిలో కొంత చెంచేలా స్వభావం, ఒక్కోసమయంలో స్నేహితులను కోల్పోయేలా చేస్తుందనేది పండితుల మాట.
Image result for kumbha rashi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here