షర్మిల పై తప్పుడు పోస్టులు పెట్టిన సైట్లు ఇవే?

0
65
ఇటీవల కొద్దిరోజుల క్రితం నుండి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిల గారికి అలానే సినిమా హీరో ప్రభాస్ కు సంబంధం ఉందని పలు పుకార్లు చాలా మీడియా వేదికల్లో వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఒకమారు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసిన షర్మిల, అనంతరం పోలీసులు దానిపై కొంత చర్యలు తీసుకుంటాం అని చెప్పడంతో ఊరుకున్నారు. ఇక మళ్ళి ప్రస్తుతం అవే పుకార్లు ఉత్పన్నం అవుతుండడంతో షర్మిల మొన్న హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ని కలిసి ఇటువంటి కుట్ర చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి ఆమె కోరారు. వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.
 Image result for ys sharmila
సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ ప్రారంభించిన సైబర్‌ క్రైం పోలీసులు షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ప్రచారాలకు సంబంధించి 12 వెబ్‌సైట్లను గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల వివరాలు తెలియగానే సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసుల జారీ చేయనున్నారు. ఐపీ అడ్ర్‌సలు చేరడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశముందని తెలిపారు. వాటి ఆధారంగా నిందితుల వివరాలు రాబట్టి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఆ పేర్లు ఎవరెవరివా అంటూ కొన్ని మీడియా వేదికల్లో చర్చర్లు మొదలయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో వారి పేర్లు కూడా బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here