అందమైన చర్మానికి ముచ్చటైన మూడు టిప్స్… చూస్తే వదలరు!

0
77
నిజానికి మనలో చాలామంది ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ లేక మరేదైనా ఈవెంట్ వంటి వాటికీ వెళ్లేముందు తమ ఫేస్ కి బాగా మేకప్ వంటివి వేసుకుని వెళ్తుంటారు. అంతవరకు బాగానే వుంది. అయితే పార్టీలో ఎంతో అందంగా కనపడిన మనము, పార్టీ అయిపోయి ఇంటికి తిరిగివచ్చాక మాత్రం దానిని పెద్దగా పట్టించుకోకుండా మొహాన్ని మాములుగా సబ్బుతో కడుక్కోవడం, లేదా సాధారణ వాటర్ తో కడుక్కుని తరువాత పడుకుంటుంటాం. అయితే ఆ విధంగా కాకుండా పెద్దగా శ్రమపడనవసరం కూడా లేకుండా, మూడు పద్ధతుల్లో ఫేస్ ని ఒక అరగంటలో శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా ఫేస్ ని క్లెన్సింగ్ చేసుకోవాలి, దానికోసం మొహానికి వాజిలిన్ అప్లై చేసుకుని తరువాత ఒక టిష్యూ పేపర్ తో మొహాన్ని శుభ్రం చేసుకుంటే మొహం మీద మురికి వచ్చేస్తుంది. అదే పొడి చర్మం వారైతే కొబ్బరినూనె, బాగా డ్రై చర్మం వారైతే అలోవెరా జెల్ తో శుభ్రం చేసుకోవచ్చు.
Related image
ఇక రెండవది స్క్రబ్బింగ్, దీనికోసం ఒక స్పూన్ పంచదారలో ఒక హాఫ్ స్పూన్ తేనె వేసి కలుపుకుని దానిని మొహంపై కాసేపు బాగా మర్దన చేసుకోవాలి, అది మొహానికి బాగా పట్టిన తరువాత మొహాన్ని టిష్యూ తో క్లిన్ చేసుకోవాలి. ఆపై ఫేస్ ప్యాక్ చేసుకోవాలి, దీనికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. దానికోసం ఒక రెండు స్పూన్లు శనగపిండి మరియు ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకుని రెండు బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని దానిని మన మొహం పై అప్లై చేసుకుని, కొంతసేపటికి ఆరిన తరువాత దానిని ఆఖరుగా చల్లటి నీళ్లతో శుభ్రం కనుక చేసుకుంటే, మొహం పై వున్నమురికి, జిడ్డు, అలానే బరకతనం అంతా పోయి మొహం కాంతివంతంగా ఉండడంతోపాటు ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఇలా రోజు చేయవలసిన అవసరం లేదు, మీరు పార్టీలు వంటివాటికి వెళ్లి వచ్చిన రోజు మాత్రం చేస్తే చాలట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here