నేడు క్రికెట్ గాడ్ సచిన్ పుట్టినరోజు…….

0
17

సచిన్ టెండూల్కర్  ప్రపంచ వ్యాప్తంగా బహుశా  ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండక పోవచ్చు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ మరియు క్రికెట్ గాడ్ పిలుచు కుంటారు. నేడు ఈ క్రికెట్ దేవుడి 46 పుట్టినరోజు. సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర లోని ముంబై లో దాదర్  లో జన్మించాడు.

ఈయన అసలు పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. ఇతని  తండ్రిగారి పెరు రమేష్ టెండూల్కర్ ఈయన ప్రముఖ మరాఠి నవల రచయిత  ప్రముఖ సంగీత విద్వాంసకుడు సచిన్ దేవ్ బర్మాన్ పై ఉన్న అభిమానంతో తన కుమారుడికి సచిన్ అనే పేరు పెట్టుకున్నాడు. సచిన్ పదహారేళ్ళ వయస్సు లోనే  పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ తో ఆంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టాడు. అతి తక్కువ కాలం లోనే బ్రాడ్మన్  లాంటి   క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. రెండు దశాబ్దాల పాటు ఆంతర్జాతీయ క్రికెట్ కు సేవలు అందించాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 200 టెస్టులు, 463మ్యాచ్ లు , ఒక టి-20 ఆడిన  సచిన్. తన అంతర్జాతీయ కెరియర్ లో 34357 పరుగు చేశాడు. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 200 పరుగులు రికార్డు సృష్టించాడు. సచిన్ మొత్తం 6 ప్రపంచ కప్ టోర్నీలు ఆడాడు. చివరిగా ఆడిన టోర్నీలో ప్రపంచ కప్ సాధించి తన కల నెరవేరింది. క్రికెట్ చరిత్రలోనే 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్.

సచిన్ 2013 తన చివరి మ్యాచ్ ను వెస్టిండీస్ తో ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఆడాడు.అది  తాను 200 వ టెస్ట్. ఇక ముంబై ఇండియన్స్ తరపున ఐపీల్ లో 79 మ్యాచ్లు అది 2334 పరుగులు సాధించాడు. సచిన్ పుట్టిన రోజు సందర్భంగా అభుమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షసులు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here