టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి మృతి!

0
33
ఇటీవల కొద్దిరోజులుగా సినిమా పరిశ్రమకు చెందిన చాల మంది ప్రముఖులు వరుసగా మృత్యువాతపడడం నిజంగా అందరిని విస్మయానికి గురిచేసే విషయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అప్పట్లోఎన్నో విజయవంతమైన సినిమాలకు కో-డైరెక్టర్‌గా, అలానే పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్‌ టెక్నీషియన్‌ కె.రంగారావు మృతి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఆ తరువాత నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్‌ లాంటి సినిమాలకు దర్శకుడిగా అయన పని చేసారు.
Image result for tollywood logo

అయితే అయన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో తరువాత అయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు… ఇక ఇటీవల ఆయన చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాక దర్శకుల సంఘంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన రంగారావు మృతి పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అయితే గత కొద్దిరోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన నిన్న రాత్రి తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు… కాగా  సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్మయక్రియలు నిర్వహించనున్నారు….