వైసిపిలో చేరిన ప్రముఖ నటుడు…. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
92
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇక నేటితో తన ప్రజాసంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న వైసిపి అధినేత జగన్, అతి త్వరలో ఒక బస్సు యాత్ర కూడా చేయాలనీ తన పార్టీ వారితో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ యాత్ర సమయంలో అనేకమంది నాయకులు పార్టీలోకి రావడం జరిగింది.
Actor Bhanu Chandar Joined In YSRCP - Sakshi
ఇక యాత్ర నేటి చివరిరోజు శ్రీకాకుళం లోని ఇచ్చాపురంలో ముగియనుంది, ఇక ఈ సందర్భంగా నేడు పార్టీలో చేరారు ప్రముఖ సీనియర్ నటులు భానుచందర్. నిజానికి తనకు వైఎస్సార్ గారి పాలన మరియు పద్దతలు తనకు ఎంతో నచ్చేవని, ఇక అటువంటి స్వచ్ఛమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందించగల సామర్థ్యం కేవలం వైఎస్ జగన్ కు మాత్రమే కలదని, అందుకే తాను ఈ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇక రాబోయే 2019 మొదలుకొని జగన్ మరొక 20 ఏళ్లపాటు ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. కాగా ప్రస్తుతం భానుచందర్ ఆ పార్టీలో చేరిక రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here