‘మీటూ’ ని ఫేస్ చేసిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
121
హాలీవుడ్ నుండి మన టాలీవుడ్ వరకు అన్ని సినిమా పరిశ్రమల్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఉద్యమం మీటు. కొందరు సినిమా వారు హీరోయిన్లను అవకాశాల కోసం లైంగికంగా వేధించడం, ఒకవేళ తాము చెప్పినట్లు చేయకపోతే మీకు భవిష్యత్తు లేకుండా చేస్తాం అని బెదిరించడం వంటి ఘటనలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. అటు బాలీవుడ్ లో కూడా హీరోయిన్ తనుశ్రీ దత్తా, సీనియర్ నటుడు నానా పాటేకర్ కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను లైంగికంగా వేధించాడని ఆరోపించి సంచలనానికి తెరలేపారు. ఇకపోతే టాలీవుడ్ లో వర్ధమాన నటి శ్రీ రెడ్డి ఈ కాస్టింగ్ కౌచ్ మహమ్మారి ని తరిమికొట్టాలని కొన్నాళ్ల క్రితం అర్ధనగ్న ప్రదర్శన చేసింది. అయితే మొదట ఆమెను సినిమాల నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన మా అసోసియేషన్, ఆ తరువాత కొంత తగ్గి, ఆమెను తిరిగి సినిమాల్లో నటించవచ్చని అనుమతిచ్చింది.
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న నటీమణులు మీటు పేరుతో మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇక ఇటీవల మలయాళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన భావన, తనను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించాడని, నటుడు దిలీప్ పై కేసు పెట్టి అతడిని కోర్టుకు ఈడ్చింది. అంతేకాక మరొక సీనియర్ నటి ఫాతిమాబాబు కూడా ఇటువంటి వేధింపులకు గురయ్యారట. ఆమె తెలుగులో గౌతమ్ ఎస్ఎస్ సి సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఇక తమిళంలో మంచి స్థాయిలో నటిగా కొనసాగుతున్న సమయంలో అక్కడి డీఎంకే పార్థి అధినేత స్టాలిన్ తనను లైంగికంగా వేధించారని, అంతేకాక తనను పదిరోజులపాటు నిర్బంధించి అత్యాచారం కూడా చేసాడని అప్పట్లో సంచలన ప్రకటన కూడా చేసారు.
ఇక ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ నగ్మా, ఒక రాజకీయ సభా వేదికపై మాట్లాడుతున్న సమయంలో అక్కడి ఒక బీజేపీ కార్యకర్త ఆమెను ముద్ద్దాడడం అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. అంతేకాదు ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్, నటి రాధికాల ముద్దుల కుమార్తె వరలక్ష్మి కూడా ఈ తరహా వేధింపులకు గురైందట. తనకు ఒక సినిమా అవకాశం ఇస్తానని చెప్పిన ఒక నిర్మాత, అతడి గెస్ట్ హౌస్ కి రమ్మని ఆహ్వానించాడని, అయితే ఆ పరిస్థితిని తాను ధైర్యంగా ఎదిరించానని, మహిళలు ఇటువంటి ఘటనల పట్ల ఎప్పటికపుడు ధైర్యంతో ముందుకు సాగాలని వరలక్ష్మి చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here