మీ స్కిన్ వైట్ గా కావడానికి టమాటో చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు!

0
96
ప్రస్తుతం మనలో ఎక్కువమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్ ఏంటంటే దుమ్ము మరియు ధూళితో మన స్కిన్ కొంత నల్లబడి, అలానే పొడిబారి మడ్డిపట్టినట్లుగా కనపడడం. అయితే అటువంటి వాటికి మనం రోజువారీ ఇంట్లో వాడుకునే టొమాటోతో చెక్ పెట్టొచ్చు. ముందుగా స్కిన్ ని క్లెన్సింగ్ చేసుకోవాలి, దానికోసం ఒక టీ స్పూన్ టమాటో రసాన్ని మరియు ఒక స్పూన్ పాలను తీసుకుని రెండు మిక్స్ చేసి, మన చర్మం పై కాసేపు మర్దన చేసి ఒక 15 నిముషాలు అలానే వదిలేయాలి. తరువాత స్క్రబ్బింగ్ చేసుకోవాలి, దాని కోసం ఒక టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ సెనగపిండి తీసుకుని రెండు కలుపుకుని, ఆపై ఒక టొమాటోని ముక్కలా కోసి, దానిని ఆ కలిపిన పిండిలో ముంచి అదే చర్మంపై రబ్ చేసుకోవాలి.
Related image
ఇక మూడవది ఫేస్ ప్యాక్ వేసుకోవడం, దానికోసం కొన్ని టమాటో ముక్కలు తీసుకుని వాటిని గ్రైండ్ చేసి, అందులో ఒక టీ స్పూన్ పెరుగు మరియు ఒక టీ స్పూన్ తేనె, అలానే రెండు టీ స్పూన్ల సెనగపిండి కలుపుకుని ఒక పేస్ట్ లా చేసి దానిని మనం చర్మంపై అప్లై చేయాలి. దానిలోని ఆస్ట్రిజెన్ ప్రాపర్టీస్ చర్మాన్ని మృదువుగా చేసి మురికిని పూర్తిగా తొలగిస్తాయట. ఇక పైన చెప్పిన మూడు పద్దతుల ప్రకారం మన చర్మానికి అవి క్రమం తప్పకుండ కొన్నాళ్లపాటు అప్లై చేసుకుంటే చర్మం ఎప్పుడూ తెల్లగా నిగనిగలాడుతూ, కాంతివంతంగా మెరిసిపోతుందట. అయితే ఇవి చేసుకోవడమే కాదు, ఎప్పుడూ దుమ్ము, ధూళి నుండి తప్పించుకోవడానికి చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులను కూడా వేసుకోవాలని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. మరి మన అందరికి ఎంతో ఉపయోగకరమైన ఈ చిట్కాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here