రేపు క్యాబ్ లు ఆటోల బంద్… మ్యాటర్ ఏంటంటే?

0
74
ఆర్టీసీ, బ్యాంకులు, కార్మికులు  వంటి కొన్ని ప్రభుత్వ సంఘాలు కూడా తమకు న్యాయం చేయడం లేదని ఇటీవల సమ్మె బాట పట్టాయి. ఇక త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మోటార్ వెహికిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రైవేట్ వాహనాలైన ఆటోలు మరియు క్యాబ్ ల వంటి వాటిని పూర్తిగా నిలిపివేసి బంద్ చేపట్టనున్నారు మోటారు కార్మిక సంఘాల వారు. ప్రభుత్వం మొదటినుండి మాపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది అని,
Related image
ఇక ప్రస్తుతం తాము చేపట్టబోయే బంద్ కు ప్రజలు పూర్తిగా మద్దతు ప్రకటించాలని, అంతేకాక ఈ బంద్ వల్ల సాధారణ ప్రజలు ఎవరూ నష్టపోకుండా చేసి ,వారికి ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సమ్మెతో తమకు తప్పకుండ ప్రభుత్వం నుండి మంచి వార్త వస్తుందని, ఈ నూతన సంవత్సర వేళ ప్రధాని మరియు కేంద్ర మంత్రులు తమ మొర ఆలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here