తమ భర్తలను దారుణంగా మోసం చేసిన హీరోయిన్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

0
80
సినిమాల్లోకి వచ్చి హీరోయిన్లు గా తమ కెరీర్ ను ప్రారంభించి, మంచి సక్సెస్ లతో దూసుకెళ్లినవారు కొందరైతే, మరికొందరు మాత్రం పెద్దగా అవకాశాలు రాక అలా ఉండిపోతుంటారు. ఇకపోతే వెండితెరపై ఒకవెలుగు వెలిగిన కొందరు హీరోయిన్లు, నిజజీవితంలో మాత్రం తమ సంసార జీవితాన్ని తామే నాశనం చేసుకున్న వారు వున్నారు. ఇక వారిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది మలయాళ నటి కావ్య మాధవన్ గురించి. చూడడానికి ఎంతో అందంగా వుండే కావ్య, తనతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించిన హీరో దిలీప్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. అయితే దిలీప్ కు ఇదివరకు పెళ్లి కావడంతో వారి ప్రేమను కావ్య తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఆపై మరొక వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసారు. అయితే ఎంత పెళ్లిచేసుకున్నా తన మనసు మాత్రం దిలీప్ మీదనే ఉండడంతో కొన్నాళ్ళకు భర్త నుండి విడాకులు తీసుకున్న కావ్య, దిలీప్ వద్దకు వచ్చేసింది. ఇక విషయం తెలిసిన దిలీప్ భార్య, కావ్య పై కేసు నమోదుచేసింది. కాగా దిలీప్ కూడా భార్య నుండి విడాకులు తీసుకుని కావ్య ని మళ్ళి పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఇటీవల నటి భావనను కిడ్నాప్ చేయబోయారు అనే విషయమై దిలీప్ మరియు కావ్యలపై కేరళలో కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఇక మరొక నటి, అలనాటి బాలీవుడ్ నటి రేఖ. రేఖ ఎక్కువ సినిమాలు అమితాబ్ తో కలిసినటించడం, మెల్లగా అమితాబ్ పై ప్రేమపెంచుకోవడం మొదలైంది. అయితే అప్పటికే అమితాబ్ కి జయ తో వివాహం అవ్వడంతో అమితాబ్ అందుకు అంగీకరించలేదు. అయితే ఎలాగో కొన్నాళ్ల తరువాత రేఖ మరొక వ్యక్తితో వివాహం చేసుకుని ఇటీవల విడాకులు తీసుకున్నారు. అయితే రేఖకు ఇప్పటికీ అమితాబ్ అంటే ఎంత ఇష్టమో ఆమె చెప్పే మాటలు వింటే అర్ధం అవుతుందని, ఆమె సన్నిహితులు కొందరు చెపుతున్నారు. ఇక మరొక నటి, ఒకప్పటి అందాల తార మంజుల మరియు నటుడు విజయ కుమార్ ల తనయ వినీత. తెలుగులో దేవి సినిమాలో నటించిన వినీత, ఆకాష్ అనే టివి నటుడిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్ళకు అతడినుండి విడాకులు తీసుకుని ఆనంద్ రాజ్ అనే నటుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భర్తతో కొడుకు, రెండవ భర్తతో ఒక కూతురు సంతానం కలిగిన వినీత,  మొదటి భర్త కొడుకుని దక్కించుకోవాలని కోర్ట్ కి ఎక్కి, తన తండ్రి విజయ్ కుమార్ తన కొడుకుని నానుండి దూరం చేస్తున్నాడు అంటూ అయన పై కూడా ఫిర్యాదు చేసింది.
కాగా కొడుకు విషయమై, వినీత మరియు విజయ్ కుమారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో కొట్టుకున్న ఘటన, తమిళ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక ప్రస్తుతం ఆమె ఒక కొరియోగ్రాఫర్ తో సహజీవనం చేస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఇకపోతే మరొక సీనియర్ నటి రాధిక, మొదట ప్రతాప్ పోతన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న రాధిక, తరువాత మనస్పర్థల కారణంగా అతడినుండి విడిపోయి ఒక విదేశీయుడిని వివాహమాడింది. అయితే అతడితో కూడా పొసగక, చివరికి హీరో శరత్ కుమార్ ని మూడవ పెళ్లి చేసుకుంది. నటిగా మంచి పేరున్న రాధిక జీవితంపై మాత్రం కోలీవుడ్ లో ఎన్నో పుకార్లు ఇప్పటికీ వస్తూనే వున్నాయి. ఇక మరొక నటి సీనియర్ నటి సీత. తండ్రి సినిమా నటుడు కావడంతో అప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీత, తరువాత సినిమాల్లో నటించే పార్తీపన్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఆయనతో వచ్చిన కొన్ని గొడవల వల్ల ఆయననుండి విడిపోయి తరువాత సురేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ మధ్య సినిమాలకు పూర్తిగా దూరమైనా సీత, ప్రస్తుతం మళ్ళి సినిమాల్లో నటిస్తున్నారు. ఇక మరొక నటి అమలాపాల్, అమల కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు సాఫీ గా సాగిన వీరి జీవితంలో మెల్లగా గొడవలు రావడంతో ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. కాగా ప్రస్తుతం అమల తన తల్లితండ్రుల వద్దనే విడిగా ఉంటోందట. చూసారుగా ఈ హీరోయిన్లు ఎంతో అమూల్యమైన తమ ఫ్యామిలీ లైఫ్ ని ఏ విధంగా నాశనం చేసుకున్నారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here