మన కళ్ళతో చూస్తే కానీ నమ్మలేని నిజం…. చూస్తే ఆశ్చర్యపోతారు!

0
38
ప్రస్తుత కాలంలో మానవ విలువలు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. అందుకు ఉదాహరణగా ఇటీవల మన సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చెప్పుకోవచ్చు. ఇక నీతి నిజాయితీ అయితే మనలో చాలామంది ఎప్పుడో మర్చిపోయారు అని ఒప్పుకోవాలి. ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, మోసం రాజ్యమేలుతున్నాయి. ఇక ట్రాఫిక్, మరియు వాహనాలు నడిపే వారి విషయమై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినా, లైసెన్స్ లేదా మరేదైనా కాగితాలు లేకపోయినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేయడం తరచు మనం చూస్తుంటాం.  ఇక విషయంలోకి వెళ్తే, మిజోరంలోని ఒక నీజీయితి గల ట్రాఫిక్ పోలీస్ అధికారి తన డ్యూటీ కె కాదు, యావత్ పొలిసు వ్యవస్థకే మంచి పేరు సంపాదించిపెట్టాడు.
ఇక మ్యాటర్ ఏంటంటే, మిజోరం ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుగా ఎన్నో ఏళ్ళ నుండి విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ అధికారి, రోజు మాదిరిగా అక్కడి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా అమలు పరుస్తున్నారు. అయితే అక్కడి కొన్ని వ్యాపార సముదాయాల మధ్య అడ్డుగా నిలిపిన ఒక కారు వల్ల కొన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం అయన దృష్టికి వచ్చింది. ఇక తీరా చూస్తేఅది తన సోదరి కారు అను తెలుసుకుని ఏ మాత్రం, సంకోచించకుండా ఆమెకు ఫైన్ వేసి, ఆమె కారును స్టేషన్ కు తరలించాడు.
ఈ రోజుల్లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, వారు ఏదైనా తప్పు చేస్తే, పర్లేదులే అని మనలో చాలామంది వదిలేస్తుంటారు. అయితే ఇంత నిజాయితీగా, పైగా తన సోదరి చేసిన పనిని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా, మిగతా పౌరులవలె ఆమెకు శిక్ష వేసినందుకు, పలువురు ప్రజలు ఆయనకు సోషల్ మీడియా వేదికల్లో ప్రశంశలను తెలుపుతూ, అభినందిస్తున్నారు. మీలాంటి పొలిసు ఒకరు ఉంటే చాలు, మన దేశం ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతుంది, మీవంటి వారు ఎందరికో ఆదర్శం అంటూ ట్వీట్స్ మరియు కామెంట్స్ చేస్తున్నారు.