ఇద్దరు రాజకీయ నాయకులకు క్యాన్సర్, స్వైన్ ఫ్లూ… ఎవరో తెలిస్తే అవాక్కవుతారు!

0
87
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అలానే ఆహార పదార్ధాల్లో కల్తీ వంటి వాటి వలన నేటి మనిషి అనేక రోగాలతో సతమతం అవుతున్నాడు. ఇక మరీ క్యాన్సర్ మహమ్మారి అయితే విపరీతంగా విజృంభిస్తోంది. అయితే నిజానికి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి మందులు ఉన్నప్పటికీ కూడా ఈ భయంకర వ్యాధి బారిన పడుతున్న వారు రోజురోజుకు మరింత పెరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం 66 ఏళ్ల బిజెపి నాయకులూ మరియు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి మృదుకణజాల కేన్సర్ అని తేలడంతో రెండు వారాల పాటు సెలవు పెట్టి వ్యక్తిగత సెలవుపై చికిత్స కోసం అమెరికా బయలుదేరివెళ్లారు. న్యూయార్క్ లో ఆయన కేన్సర్ కు చికిత్స చేయించుకోనున్నారు. అయితే ఇక్కడే సమస్య ఉందని వైద్యులు సూచిస్తున్నారట.. కేన్సర్ ను గుర్తించి ఆపరేషన్ చేస్తే ఆయన మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడి ప్రాణాలకే  ముప్పురావచ్చని అందువలన ఆపరేషన్ చేయలేమంటున్నారు డాక్టర్లు..
Image result for arun jaitley amit shah
అంతేకాక కీమో థెరపీకి కూడా ఆయన బాడీ సహకరించదని డాక్టర్లు తేల్చారట. దీంతో మందులతోనే తగ్గించాల్సిన పరిస్థితి. ఇక ఇటీవల చలిలో పర్యటనలు పెట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకింది. ఛాతీ, శ్వాసకోశ సంబంధ సమస్యలతో బుధవారం రాత్రి ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో అత్యవసరంగా చేరారు. తనకు స్వైన్ ఫ్లూ సోకిందని, అతి త్వరలో ప్రజల ఆశీర్వాదంతో కోలుకుంటానని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ఇక ఈ విధంగా కేంద్ర బీజేపీ నాయకులూ అనారోగ్యాల బారిన పడడంతో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులూ రాహుల్ సహా పలువురు వారు కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here