తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమికి అదే ముఖ్య కారణం : పీసీసీ చీఫ్ఉత్తమ్ కుమార్ రెడ్డి!

0
86
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ, టిజెఎస్, సిపిఐ లతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందని, అలానే నిజంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, మాకు ఈసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తామని మహాకూటమి శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ఎంత ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక చివరికి మరొక్కసారి టిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అయితే టీడీపీతో జతకట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువ సీట్లు వచ్చాయని పలు రాజకీయ వర్గాలు, మరియు ప్రజలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తాము ఓటమిపాలు అవడానికి ఒక ముఖ్య కారణాన్ని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేడు మీడియాతో అయన మాట్లాడుతూ, చంద్రబాబు వంటి రాజకీయ అనుభవజ్ఞుడితో జతకట్టడం మంచిదే అని,
Related image
అయితే రాష్ట్రంలో సీట్ల పంపకం మరియు అభ్యర్థుల్ని నిలబెట్టిన కొన్ని స్థానాల్లో సరిగ్గా ప్రచారం నిర్వహించకపోవడం, అలానే మరికొన్ని చోట్ల అభ్యర్థులకు అక్కడి స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లనే తాము ఓడిపోవలసివచ్చిందని అయన స్పష్టం చేసారు. అయితే టీడీపీ, టిజెఎస్, సిపిఐలు కూడా గెలుపుకోసం ఎంతో కృషి చేశాయని, ఓటమిపై వారెవ్వరినీ తప్పుపట్టవలసిన అవసరం లేదని అన్నారు. ఇక ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన నిలిచి అధికారపక్షం మెడలు వంచి పని చేయిస్తామని, అలానే కేసీఆర్ పాలనలో ఏమాత్రం తప్పులు దొర్లినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా గట్టిగా నిలదీస్తామని అయన అన్నారు. అధికారం ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతం కాదు, ఈ ఎన్నికలు కాకపోతే రాబోయే ఎన్నికల్లో మాసత్తా చాటుతాం అంటూ చెప్పుకొచ్చారు ఉత్తమ్. కాగా ప్రస్తుతం అయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here