వై సి పి కి షాకిచ్చిన వంగవీటి? టి డి పి లో చేరికకు ముహూర్తం ఖరారు .Telugugaramchai

0
50

వై సి పి వీడిన విజయవాడ నేత వంగవీటి రాధాక్రిష్ణ ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరని విషయం తెలిసిందే. ఆయన టి డి పి లో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగినా ఎందుకో వెనకడుగు వేశారు. ఈ విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వంగవీటి మన పార్టీలోకి వస్తున్నారని , అందరు కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు వ్యాఖ్యానించారు. కానీ ఆయన  తటస్తంగా ఉండటంతో తిరిగి వై సి పి లోకి రావాలని ఆ పార్టీ నేతలు రాయబారాలు సాగించినట్టు వార్తలు హాల్ చల్ చేసాయి. ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎం పి లగడపాటి రాజగోపాల్ తో కలిసి వంగవీటి రాధా ఉండవెల్లి లోని చంద్రబాబు నివాసానికి కి రహస్య మంతనాలు సాగించారు. 

చంద్రబాబు,వంగవీటి ల మధ్య భేటీ  దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగినట్టు తెలుస్తుంది. వంగవీటి తన రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు తో మాట్లాడటానికి వచ్చినట్టు సమాచారం. రాధా డిమాండ్ల పరిస్కారానికి  చంద్రబాబు నుంచి స్పష్టత లభించిందని ,నేడో రేపో అధికారికంగా టి డి పి చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సీటు కేటాయించలేమని ,నరసారావు పేట లేదా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో,టి డి పి లో చేరేందుకు వంగవీటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.ఒకవేళ ఎం పి గా పోటీ చేసి ఫలితం తారుమారైన రాజకీయా భవిషత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని , విజయవాడకు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో రాధా అనుచరులకు ప్రాధానత్య ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.  సి ఎం తో భేటీ తర్వాత వంగవీటి తనకు వై సి పి లో జరిగిన అవమానాలను వెల్లడించారు.తాను పోటీ చేయడం ముఖ్యం కాదని వై సి పి ఓడించడమే ప్రధాన  లక్షమని పేర్కొన్నారు. రేపు సాయంత్రం లోగా టి డి పి లో చేరేందుకు రాధా అంగీకారం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here