పార్టీ మార్పుపై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు!

0
87
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో తెలుగు ప్రజలందరి దృష్టి ఆంధ్ర రాజకీయాలపై పడింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్నీ కూడా విరివిగా ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నాన్ని ప్రారంభించాయి. ఇక ఏపీకి ఆయువుపట్టైన విజయవాడలో రాజకీయాలు ఎన్నడూ లేనంత వాడి వేడిగా మారాయి. ఇక ఇక్కడి సెంట్రల్ నియోజకవర్గం నుండి 2004లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచిన వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధా, ఆ తరువాత 2009లో  పీఆర్పీ నుండి, ఆపై 2014లో వైసిపి నుండి పోటీ చేసి ఘోర పరాజయాన్ని పొందారు. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా అయన సెంట్రల్ నుండి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇక గత కొద్దిరోజలుగా వైసిపి పార్టీ కార్యక్రమాల్లో నిరాశక్తితో పాల్గొంటున్న రాధా, నిన్న రంగ గారి 30వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పలు చోట్ల తండ్రి విగ్రహాల వద్ద పూలదండలు వేసి అభిషేకాలు నిర్వహించారు. ఇక రంగా స్వగ్రామమైన ఉయ్యూరు మండలం కాటూరులో రాధారంగా స్మరణ భూమి శంకుస్థాపన కార్యక్రమంలో రాధా మరియు అయన తల్లి రత్నకుమారితోపాటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ నేత యలమంచిలి రవి పాల్గొన్నారు. అయితే ఈ ఒక్క కార్యక్రమంలో మినహా మిగిలిన చోట్ల ఎక్కడా వైసీపీ నేతల సందడి కానీ, ఆ పార్టీ జెండాలు కానీ కనిపించలేదు.
Image result for vangaveeti radha
ఇక అయన ఆశిస్తున్న సెంట్రల్ నుండి వైసిపి సమన్వయ కర్తగా ఇటీవల మల్లాది విష్ణుని నియమించింది పార్టీ అధిష్టానం. దీనితో రాధా ఆశలపై నీళ్లు చల్లినట్లైందని భావించిన పార్టీ అధినేత జగన్, ఆయన్ను తూర్పు నుండి కానీ లేదా మచిలీపట్టణం ఎంపీ స్థానం నుండి పోటీ చేయించాలని అనుకున్నారట. అయితే తూర్పు నుండి ఇప్పటికే యలమంచలి రవి, అలానే మచిలీపట్టణం నుండి వల్లభనేని బాలశౌరి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి పర్యటనలు చేస్తుండడంతో ఆ ప్రాంతాల్లో కూడా ఆయనకు సీటు దక్కే అవకాశం కనపడడం లేదని సమాచారం. ఇక నిన్న విజయవాడలోని రంగ సంస్మరణ సభలో పాల్గొన్న రాధా, నిజానికి తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాదల్చుకోలేదని అన్నారు. అయితే రాధా కొద్దిరోజులనుండి వైసీపీపై  వ్యతిరేకతతో వున్నారని, ఇక త్వరలో అయన జనసేన లేదా టీడీపిల్లో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం. కాగా ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here