ఆసక్తి రేపుతున్న వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” వీడియో……ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటించారంటే?

0
83
ఇటీవల విడుదలైన నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో రూపొందిన దివంగత నటులు మరియు టిడిపి పార్టీ అధ్యక్షులు అయిన ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఇక ఆ సినిమాకు పోటీగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, లక్ష్మి పార్వతి మరియు ఎన్టీఆర్ ల అనుబంధానికి చిహ్నంగా తాను నిజమైన కథను చూపించబోతున్నాను అంటూ తీస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాకు సంబంధించి వర్మ ఇప్పటికే లక్ష్మి పార్వతి, చంద్రబాబు నాయుడుల పాత్రలు రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అయన లుక్ ని విడుదల చేస్తూ ఇదే అసలైన సినిమా అంటూ ఒక చిన్న వీడియో బిట్ విడుదల చేసారు. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోవటం ప్రేక్షకుల వంతైంది.
వర్మ చెప్పినంత పని చేసేశారే అని ముక్కున వేలేసుకున్నారంతా. ఇందులో కనిపిస్తున్న నటుడు అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండటమే ఇందుకు కారణం. దీనికి తోడు ‘‘ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత.. లక్ష్మీస్ ఎన్టీఆర్లో మళ్లీ పుట్టారు’’ అని వర్మ పెట్టిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదల చేసిన ఈ వీడియోతో వర్మ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాత కావటం గమనార్హం. లక్ష్మీపార్వతిగా కన్నడ నటి యజ్ఞాశెట్టి చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here