శంకర్ డైరెక్షన్ లో ఆ సినిమా మిస్ అయినందుకు బాధపడుతున్నా : విక్టరీ వెంకటేష్ 

0
90
గత కొద్దిరోజులుగా విక్టరీ వెంకటేష్ కు సరైన సక్సెస్ రావడం లేదనే చెప్పాలి. అయితే ఆయన ఇటీవల నటించిన ఒక్క దృశ్యం మూవీ మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. ఇకపోతే ప్రస్తుతం అయన  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కేరీర్ మొదలు పెట్టి ముప్పయ్యేళ్లు అయిందని, ఒక దశకు చేరుకున్న తర్వాత అది మల్టీస్టారరా లేక సోలో సినిమానా అని ఆలోచించడం మానేస్తామన్నారు. ఇక అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రోజా’ మూవీ ని వదులుకోవడానికి గల కారణాలను అయన చెప్పారు. చాలాసార్లు మన దగ్గరికి వచ్చిన మంచి కథల్ని చేయలేం.
Image result for venkatesh f2 movie
నిజానికి ‘రోజా’ సినిమాని నేను చేయాల్సింది. అయితే అప్పట్లో చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. అది చేసుంటే హిందీవైపు వెళ్లి అక్కడే బిజీ అయ్యేవాణ్నేమో అని అన్నారు. కానీ అది చేయలేకపోయానే అని పెద్దగా బాధపడలేదు. కాకపోతే శంకర్ వంటి ప్రసిద్ధ దర్శకుడితో చేస్తే మన పేరు కూడా కొంత పెరిగేది అని అన్నారు. ఇక ‘బాహుబలి’ వంటి చారిత్రాత్మక సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. అమితాబ్‌ ‘బ్లాక్‌’, ఆమిర్‌ఖాన్‌ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా మనమూ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఆ అవకాశం రావాలి. నాకెందుకు రాలేదని ఆలోచిస్తూ కూర్చుంటే అసలేమీ చేయలేం కదా అని అయన పేర్కొన్నారు. కాగా వెంకటేష్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here