విజయ్ దేవరకొండకు జరిగిన ప్రమాదంపై విజయ్ దేవరకొండ తల్లి ఏమి చేసిందో తెలుసా!

0
82
సినిమా పరిశ్రమలో నటులు నటించేటప్పుడు అక్కడక్కడా కొంత అజాగ్రత్తవల్ల కానీ, లేదా అనుకోకుండా గాని ప్రమాదాలు జరిగి, కొందరు వాటి బారినపడి గాయాల బారిన పడడం అక్కడక్కడా చూస్తుంటాం. ఇక ప్రస్తుతం యువ నటుడు విజయ్ దేవరకొండ అయన నటిస్తున్న కొత్త సినిమా డియర్ కామ్రేడ్ సినిమాలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా గాయాలపాలయ్యారట. అయితే ఈ విషయాన్నీ విజయ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరుస్తూ ఒక ఫోటోని పోస్ట్ చేసాడు. ఒక్కోసారి మనం పడే కష్టం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది, అలానే జీవితంలో ఏది కూడా అంత ఈజీగా రాదు అంటూ పోస్ట్ చేసారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, డియర్ కామ్రేడ్ సినిమా ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది, అయితే సినిమాలో విజయ్ ఒక సన్నివేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుండి వేగంగా మెట్లు దిగుతూ కదులుతున్న ట్రైన్ ఎక్కే సన్నివేశాన్ని తీస్తున్నారట యూనిట్.
ఇక ఆ సమయంలో బ్రిడ్జి మెట్లు దిగిన విజయ్, ట్రైన్ ఎక్కడంలో తడపడి ఒక్కసారిగా క్రింద పడిపోయారట. ఇక వెంటనే అది గమనించిన సినిమా యూనిట్ ఆయన్ని పైకిలేపి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారట. అయితే తన పరిస్థితి బాగుందని విజయ్ ఫోటో పెట్టడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనతో విజయ్ తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఇప్పుడిప్పుడే  విజయ్ మంచి అవకాశాలతో సినిమాల్లో ముందుకెళ్తున్నాడని, కానీ ఇటువంటి సమయంలో ఇలా తనకు పెద్ద ప్రమాదం తప్పడంతో ఆమె విషయం విని కన్నీరుమున్నీరయ్యారట. ఇక ఆయన తండ్రి కూడా కొంత ఆందోళన చెందారని, అయితే డాక్టర్లు పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పడంతో అందరూ కొంత ఊపిరిపీల్చుకున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here