యూట్యూబ్ ని షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ యాడ్ వీడియో!

0
81
ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హవా విపరీతంగా నడుస్తోంది అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అదే దూకుడుని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆపై వచ్చిన గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఇక అదే ఊపుతో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గానూ అదే హవాను కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై డియర్ కామ్రేడ్ అనే సినిమాతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇక తాజాగా సంగీతా మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విజయ్, దీని కోసం రూపొందించిన యాడ్ లో నటించాడు. ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.
Image result for vijay devarakonda new ad
ఈ యాడ్ లో విజయ్ తోపాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా నటించాడు. అందులో కిశోర్ మేకగా కనిపించడం అందరిని ఆకట్టుకుంటోంది. గొర్రెల మందల్లా జనాలు ఒకరు ఏది చేస్తే, అది మిగతావారందరూ అనాలోచితంగా ఫాలో అవుతుంటారని సింబాలిక్ గా చూపిస్తూ చేసిన ఈ యాడ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ పేరు మార్మోగిపోతోంది. ఆ తర్వాత చరణ్, బన్ని, అఖిల్ వంటి హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతుండగా, ప్రస్తుతం విజయ్ వారికీ బ్రాండ్స్ విషయంలో గట్టి పోటీనే ఇస్తున్నాడు అంటున్నారు. ఇక ఈ వాణిజ్య ప్రకటనల విషయంలో దేవరకొండ ఒక్కో కమిట్ మెంట్ కి ఏడాదికి రూ.2 నుండి రూ.3 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. ఎంతైనా యూత్ లో ఆయనకున్న క్రేజ్ అటువంటిది మరి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here