నా అకౌంట్ ను బ్లాక్ చేసారు : విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్!

0
61
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఊపులో వున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు తన అభిమానులతో విజయ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Related image
‘నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు, రూ.500 మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చెయ్యలేదని నా అకౌంట్‌ను లాక్‌ చేసిన్రు. అప్పుడు మా నాన్న, మనకు ముప్పై వచ్చే లోపు లైఫ్ లో బాగా సెటిల్‌ కావాలని, అలానే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయగలవని  అన్నారు. నాలుగేళ్ల తరువాత, ఇకపోతే ఫోర్బ్స్‌ సెలబ్రెటీలో స్థానంలో సంపాదించాను’ అంటూ అప్పటి పరిస్థితులను తలచుకుంటూ ట్వీట్‌ చేశాడు. విజయ్‌ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సొసైల్ మీడియా వేదికల్లో విపరీతంగా  వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here