హుషారు మూవీపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

0
88
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. నిజానికి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించిన విజయ్ ,ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. అయితే మొదట హీరోగా చేసిన సినిమానే మంచి హిట్ అవడంతో విజయ్ కి అవకాశాలు బాగానే దక్కాయి. ఆపై అర్జున్ రెడ్డి, గీత గోవిందం కూడా మంచి హిట్స్ సాధించడంతో విజయ్ కి యూత్ మరియు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అయితే అక్కడి నుండి విజయ్ తన సినిమాలు జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా హుషారు. కొత్త నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, గీత గోవిందం, భరత్ అనే నేను సినిమాల్లో మంచి రోల్స్ లో నటించి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ కూడా ఒక ప్రధాన పాత్ర చేసాడు.
అయితే ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవల చూసిన విజయ్, తన ఫ్రెండ్ అయిన రాహుల్ నటించిన ఈ సినిమా తప్పకుండ విజవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తాను కొద్దిరోజుల క్రితం చూడడం జరిగిందని, అవి చూసిన తనకు తప్పకుండ సినిమా  మంచి హిట్ అయి యూనిట్ సభ్యులందరికి మంచి పేరు తీసుకువస్తుందని భావించించినట్లు తెలిపారు. అంతేకాక ప్రస్తుతం మంచి ఆఫర్లతో దూసుకుపోతున్న రాహుల్ కు ఈ సినిమా మరింత బూస్ట్ ని ఇచ్చి, ముందుముందు మరింత పేరు తెచ్చిపెట్టడం ఖాయమని విజయ్ చెపుతున్నారు. అందుకే తన తరపున యూనిట్ సభ్యులందరికి అల్ ది బెస్ట్ చెపుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here