ఇష్టం లేని పెళ్ళికి ఒకే చెప్పిన విజయ్ దేవరకొండ…..మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
108
ప్రస్తుతం యూత్ లో తనకంటూ కొంత ప్రత్యేక ఇమేజిని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. నిజానికి పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో హీరోగా మారిన విజయ్, ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, ఇక ఆ తరువాత అర్జున్ రెడ్డి వంటి వైవిధ్యమైన క్యారెక్టర్ లో నటించిన విజయ్, ఆ సినిమా ఊహించని విధంగా అద్భుత విజయాన్ని అందుకుని దూసుకుపోవడంతో ఓవర్ నైట్ స్టార్ గా టాలీవుడ్ లో సరికొత్త రికార్డుని సృష్టించారు. ఇక ఇటీవల అయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో నటించిన గీత గోవిందం కూడా మంచి యూత్ ఫుల్ మూవీ గా నిలిచి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడంతో విజయ్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇటీవల అయన చేసిన నోటా మరియు టాక్సీవాలా సినిమాలతో తన అభిమానులను కొంత నిరాశపరిచిన విజయ్, రాబోయే రోజుల్లో వారికీ మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని తలచి, జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం అయన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భరత్ కమ్మా దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే విజయ్ కు సంబందించిన ఒక ఆనందకరమైన వార్త అయన అభిమానుల్లో సంతోషాన్ని నింపుతో వైరల్ గా మారింది. అదేమిటంటే, విజయ్ కి నిన్న పెళ్లి నిశ్చయమైందని అంటున్నారు. నిజానికి గత కొద్దినెలలుగా విజయ్ తల్లితండ్రులు ఆయనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారని, అయితే ఇన్నాళ్లకు విజయ్ కి సరిగ్గా సరిపోయే ఒక మంచి అమ్మాయిని ఆయనకు భార్యగా కుటుంబ సభ్యులు నిర్ణయించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఒక సంప్రదాయబద్ధమైన తెలుగింటి కుటుంబానికి చెందిన అమ్మాయిని సెలెక్ట్ చేసారని, అయితే విజయ్ కి మాత్రం ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, కానీ తల్లితండ్రుల కోరికను కాదనలేక అయన ఈ పెళ్ళికి పచ్చ జెండా ఊపారని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని ఎంత బయటకు రాకుండా దాచినప్పటికీ కూడా కొన్ని మీడియా వర్గాలనుండి ఈ వార్త లీక్ కావడం, వెంటనే అన్నింటా వైరల్ గా మారడం జరిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here