బేబీ పదిరోజుల్లో ఎంత డబ్బు సంపాదించిందో తెలుసా….!

0
106
రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెలో సరదాగా పాటలు పాడుకుంటూ రోజువారీ కూలి పనులు చేసుకునే బేబీ ప్రస్తుతం ఒకరకంగా సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకుందని చెప్పాలి. అయితే బేబీ మొదట్లో పడిన కష్టాలు తెలిసిన వారు, ఆమెకు దేవుడు మంచి గాత్రం అయితే ఇచ్చాడు కానీ, మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలకేపోయాడు అని బాధపడేవారట. ఇక ఆమె భర్త కూడా రోజు తాగివచ్చి ఆమెని హింసించి, వచ్చిన డబ్బులు కాస్త తీసుకెళ్లి ఖర్చుచేసేవాడని చెప్తున్నారు. ఇక మెల్లగా సోషల్ మీడియా మాధ్యమాల్లో బేబీ గానమాధుర్యాన్ని పలువురు సినీ ప్రముఖులు గుర్తించడం, ఆపై ఆమెను తమదగ్గరకు పిలిపించుకుని తమవంతుగా సత్కరించడం జరుగుతున్నాయి. ఇక మొదట సంగీత దర్శకుడు కోటి ఆమెను కలిసి, ఇటువంటి గాన కోకిలని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇకపై గుర్తిస్తుందని, అంతేకాక ప్రేక్షకులు కూడా బేబీ గానమాధుర్యాన్ని ఆస్వాదించే రోజులు వచ్చాయని ప్రశంశించారు. ఆపై అయన తనవంతుగా ఆమెకు కొంత ఆర్ధిక సాయాన్ని కూడా అందించినట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ ని కలిసిన బేబీకి అయన లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు.
ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఎస్ జానకి వంటి ప్రముఖులు కూడా ఆమెకు కొంత సాయం చేశారట. ఇక నిన్న బేబీతో పాత పాడించిన రఘు కుంచె కూడా కొంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా కూడా అందచేశారట. అంతేకాదు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కూడా తనవంతుగా కొంతడబ్బును బేబీ కి చెక్ రూపేణా పంపించారట. ఇక ఇప్పటివరకు పలువురు సినిమా ప్రముఖులను కలిసిన బేబీకి దాదాపుగా అప్పుడే కొన్ని లక్షల రూపాయలు బహుమతి రూపంలో ముట్టాయని అంటున్నారు. అయితే ఇన్నాళ్ల తన బాధను గుర్తించిన ఆ భగవంతుడు, తనకు ఇలా ప్రముఖులను కలిసి తన టాలెంట్ ని నిరూపించుకునే అవకాశం ఇచ్చాడని, ఇకపై తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తన కుటుంబ సమస్యలని కూడా సరిదిద్దుకుని ప్రేక్షకులకు చేరువవ్వాలనేది తన కోరిక అని చెప్తున్నారు బేబీ. మరి ఆమె కోరిక త్వరలోనే నెరవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here