మరింత ముదిరిన వినయవిధేయ రామ మూవీ వివాదం…. వైరల్ అవుతున్న న్యూస్!

0
327
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా, విపరీతమైన అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. అక్కడక్కడా కొన్ని బి మరియు సి సెంటర్లు మినహాయిస్తే, దాదాపుగా విడుదలైన చాలాచోట్ల ఈ సినిమా కొన్న వారికీ భారీ నష్టాలు అంటే, దాదాపుగా రూ. 50కోట్లకు పైగా తీసుకువచ్చింది. అయితే సినిమా కొన్న వారి నష్టాలు కొంత భర్తీ చేయడానికి హీరో చరణ్, నిర్మాత దానయ్య చెరొక రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చారట.
Image result for boyapati danayya
అయితే అది బయ్యర్ల నష్టాన్ని చాల తక్కువ మాత్రమే భర్తీ చేయగలదని, కానీ దర్శకుడు బోయపాటి కూడా తనవంతుగా ఒక రూ.5 కోట్లు ఇస్తే వారికీ మరింత సాయంగా ఉంటుందని నిర్మాత దానయ్య, దర్శకుడు బోయపాటిని కోరారట. అయితే అందుకు సమ్మతించని బోయపాటి, విషయాన్నీ దర్శక, నిర్మాతల సంఘం వద్దకు తీసుకెళ్ళడట. అయితే ఆయన అభ్యర్ధనను స్వీకరించిన సంఘం వారు, మెల్లగా సర్ది చెప్పి బోయపాటిని తనకు తోచినంత సాయం చేయమని కోరడంతో, బోయపాటి అందుకు ఒప్పుకున్నారట. అయితే తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన బోయపాటిపై నిర్మాత దానయ్య ఇకపై భవిష్యత్తులో సినిమా చేయకూడదని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here