రివ్యూ : వినయ విధేయ రామ…..టాక్ వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!

0
60
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయ పాటి శ్రీను కలయికలో ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వినయ విధేయ రామ. ఇక తెల్లవారుఝాము నుండే మెగా ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర క్యూలు కట్టారు. ఇక ఉదయం పడిన బెనిఫిట్ షో చూసిన వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అదిరిపోయినట్లు చెపుతున్నారు. కథ ప్రకారం తన కుటుంబాన్ని రక్షించుకోవడం రామ్ అనే ఒక యువకుడు శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథాంశమని, ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా, కామెడీ మరియు హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో సాగుతుందట.
Image result for vinaya vidheya rama review
ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీన్ సూపర్ అని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కొంత మెల్లగా ప్రారంభమయినప్పటికీ, ఒక నలభైనిమిషాల తరువాత ఊపు అందుకుంటుందని, అంతేకాక మంచి యాక్షన్ మరియు ఫైట్ సీన్స్ సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయని అంటున్నారు. ఇకపోతే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణమని, ఇక క్లైమాక్స్ లో చరణ్ మరియు విలన్ గా చేసిన వివేక్ ఒబెరాయ్ పోటాపోటీగా నటించారని అంటున్నారు. ఇక డిఎస్పీ మ్యూజిక్, రిషి పంజాబి మరియు ఆర్థర్ ఏ విల్సన్ కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెపుతున్నారు. మొత్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రాముడికి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వస్తుండడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here