సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వినయ విధేయ రామ న్యూఇయర్ పోస్టర్!

0
88
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వినయ విధేయ రామ. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ సినిమాపై అమాంతం క్రేజ్ పెంచేసాయి. ఇకపోతే ఈ సినిమాను బోయపాటి ఒక కొత్త పాయింట్ తో తీస్తున్నారని, అంతేకాక సినిమాలో ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ కు పెద్ద పీట వేసినట్లు టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఇప్పటికే రంగస్థలం సూపర్ హిట్ తో మంచి పేరు సంపాదించిన రామ్ చరణ్ కు ఈ సినిమా మరింత  పేరును తీసుకురావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా యూనిట్ సరికొత్త పోస్టర్ ని తమ సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేసింది. పోతే ఈ పోస్టర్ లో చరణ్, హీరోయిన్ కియారాను తన చేతులతో ఎత్తుకున్నట్లు చూడవచ్చు. ఇక నేడు విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా హల్చల్  చేస్తుండగా,పోస్టర్ అద్భుతంగా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్టర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here